వెబ్ సిరీస్ పై క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున.. మరో కొత్త ప్రయోగం
అక్కినేని నాగార్జున ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. వీలైనంత వరకు న్యూ ట్రెండ్ కు తగ్గట్లుగానే స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటారు. స్టార్ ఇమేజ్ ను పక్కనపెట్టి ప్రయోగాలు చేసే నాగార్జున మరో కొత్త దారిలో నడవబోతున్నాడు. డైరెక్ట్ ఓటీటీ వరల్డ్ లో ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చేశారు.
చీరకట్టులో అదరగొట్టిన హానీ రోజ్.. యువ తార గ్లామర్‌కు ఫిదా కావాల్సిందే!
నాగ్ వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ 2న గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో తీరిక లేకుండా పాల్గొంటున్న నాగార్జున భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా వివరణ ఇచ్చేశారు. ఇటీవల కాలంలో చాలా మంది ఆర్టిస్టులు వెబ్ కంటెంట్ లతో బిజీ అవుతున్నారు. బార్డర్స్ లేకుండా వారి టాలెంట్ ను చాలా కొత్తగా చూపిస్తున్నారు. ఇక నాగార్జున కూడా ఒక పిరియాడిక్ కథను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కబోయే ఆ వెబ్ కంటెంట్ పై నాగార్జున చాలా నమ్మకంతో ఉన్నాడట. అలాగే మరొక వెబ్ కంటెంట్ కూడా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. వైల్డ్ డాగ్ అనంతరం ప్రవీణ్ సత్తారు సినిమాతో బిజీ కానున్న నాగార్జున అలాగే బంగార్రాజును కూడా సెట్స్ పైకి తేనున్నాడు. ఇక ఏడాది లోపు వెబ్ సిరీస్ లతో కూడా స్పీడ్ పెంచాలని ఈ స్టార్ హీరో స్పెషల్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











