వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు.. చైతూ, సమంత గురించి నాగార్జున

Recommended Video

Nagarjuna Reveals Interesting Facts About Naga Chaitanya And Samantha In Majili Audio Event

నాగచైతన్య అక్కినేని, సమంత కలిసి నటించిన చిత్రం మజిలి. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ముందు ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడను. ఎందుకంటే అందరూ మాట్లాడేశారు. కాబట్టి వారిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మీకు తెలియని సంఘటన ఒకటి చెబుతాను అని నాగార్జున అన్నారు. ఆయన వెల్లడించిన విషయాలు ఇవే..

 చైతూ, సమంత అక్కినేని మాయ చేశారు

చైతూ, సమంత అక్కినేని మాయ చేశారు

నాగచైతన్య, సమంత కలిసి తొలిసారి ఏం మాయ చేశావే సినిమా చేశారు. నాకు బాగా నచ్చిన చిత్రం అది. అప్పుడు జంట బాగున్నదని అనుకొన్నాను. ఆ తర్వా మనం సినిమాలో వారిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో కూడా వారి మధ్య లవ్ అఫైర్ జరుగుతున్నదని తెలియదు అని నాగార్జున అన్నారు.

 సమంతను చూసి కుక్క పరుగెత్తిందని

సమంతను చూసి కుక్క పరుగెత్తిందని

చైతూ, సమంత మధ్య రొమాన్స్ జరుగుతున్నదనే విషయం నాకు తెలియదు. వారిద్దరూ అలా నన్ను మాయ చేశారు. ఓ రోజు మా ఇంటికి సమంత వచ్చింది. సమంతను చూడగానే మా కుక్క లియో పరుగెత్తికెళ్లింది. దానికి సమంత ఎలా తెలుసు అనే అనుమానం వచ్చింది. అదే విషయాన్ని అడిగితే నాకు లియో ముందు నుంచి తెలుసు మామ అన్నారు. అలా నాకు తెలియకుండా మాయ చేశారు.

ట్రైలర్ చూస్తే కోపం వచ్చిందని

ఇక మజిలీ సినిమా ట్రైలర్ చూస్తే కోపం వచ్చింది. ఎందుకంటే ఆ ట్రైలర్‌లో వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు అనే డైలాగ్ నాకు జివ్వు మనిపించేలా చేసింది. ఆ డైలాగ్ చూస్తే నాకు ఎలా అనిపిస్తుందో మీరే చెప్పండి. కానీ ట్రైలర్ చాలా బాగుంది. అందరూ కష్టపడి చేశారనే ఫీలింగ్ కలుగుతున్నది. సక్సెస్ అవుతుందని అందరూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అని నాగార్జున అన్నారు.

మా అబ్బాయికి మంచి భార్య లభించింది

మా అబ్బాయికి మంచి భార్య లభించింది

సినిమా చూడకముందు.. చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపిస్తుంది. మా మంచి అబ్బాయికి మంచి భార్య లభించిందనిపిస్తుంది. వారిద్దరూ చిరకాలం కలిసి జీవించాలని కోరుకొంటున్నాను. ఈ ఉగాదికి మజిలీ రిలీజ్ అవుతుంది. ఈ పండుగకు మంచి కానుక అవుతుంది అని అనుకొంటున్నారు. ట్రైలర్ చూస్తే నాకు రెండుసార్ల కళ్ల వెంబడి నీళ్లు కారాయి అని నాగార్జున అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X