For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాన్సెన్స్.. రూమర్లు ప్రచారం చేయొద్దు.. సమంత, చైతు వివాదంపై ఘాటుగా నాగార్జున.. ట్వీట్ వెనుక అసలేం జరిగిందంటే?

  |

  దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరో, హీరోయిన్లు సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకడం సినీ వర్గాలనే కాకుండా అభిమానులను, ప్రేక్షకులకు షాక్ గురిచేసింది. అయితే సమంత నుంచి నాగచైతన్య విడాకులు తీసుకొన్న తర్వాత కూడా వారి గురించిన వార్తలకు బ్రేక్ పడలేదు. ఈ మధ్యకాలంలో మీడియాలో సమంత, నాగచైతన్య గురించి వార్తలు, కథనాలు మీడియాలో మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వార్తలు, రూమర్ల మధ్య తాజాగా సమంత, నాగచైతన్య విడిపోవడంపై నాగార్జున అక్కినేని స్పందించినట్టు ఓ వార్త మీడియాలో గుప్పమన్నది. అయితే ఆ వార్తను ఖండిస్తూ నాగార్జున ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వెనుక అసలు విషయం ఏమిటంటే..

  నాలుగేళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై

  నాలుగేళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై

  అక్కినేని నాగచైతన్య నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. లాక్‌డౌన్ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో వారిద్దరూ విడిపోవాలని డిసైడ్ అయ్యారు. అయితే రకరకాల సంప్రదింపులు, చర్చల అనంతరం వారి విభేదాలు పరిష్కరించలేన్నంతగా పెరిగిపోయాయనే నిర్ణారణకు కుటుంబ సభ్యులు వచ్చారు. దాంతో వారిద్దరి విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

  అక్టోబర్ 2న తేదీన సమంత, చైతూ ప్రకటన

  అక్టోబర్ 2న తేదీన సమంత, చైతూ ప్రకటన

  నాగచైతన్య, సమంత విడిపోతున్నారనే వార్తలు, రూమర్లు, గాసిప్స్ గుప్పమంటున్న నేపథ్యంలో వారి విడాకుల వార్త అధికారికంగా అక్టోబర్ 2వ తేదీన బయటకు వచ్చింది. నాగచైతన్య, సమంత ఇద్దరు కలిసి తమ విడాకుల లేఖను తమ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నాం. మా మధ్య గొప్ప స్నేహం, ప్రొఫెషనల్ బంధం ఉంది. అది ఇక ముందు కొనసాగుతుంది. మా నిర్ణయాన్ని గౌరవించి మా ప్రైవసీకి భంగం కలిగించకూడదు అనే విధంగా ఇద్దరు తమ విడాకుల ప్రకటనలో తెలిపారు.

  ఇద్దరి మంచి కోసమే అంటూ చైతూ

  ఇద్దరి మంచి కోసమే అంటూ చైతూ

  ఇక బంగార్రాజు ప్రమోషనల్ కార్యక్రమంలో నాగచైతన్య మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అధికారికంగా సమంత విడాకులపై స్పందించారు. మా ఇద్దరి బాగు కోసమే విడిపోయాం. విడాకుల తీసుకొవడం ద్వారా ఆమె బాగుంది. నేను బాగున్నాను. మా ఇద్దరికి మంచి జరుగాలనే ఈ నిర్ణయం తీసుకొన్నాం అని నాగచైతన్య స్పందించారు. అయితే సమంత ఇప్పటి వరకు తమ విడాకుల సంఘటన గురించి ఎన్నడూ పెదవి విప్పలేకపోవడం గమనార్హం.

  నాగార్జున చెప్పినట్టు మీడియాలో కథనాలు ఇలా

  నాగార్జున చెప్పినట్టు మీడియాలో కథనాలు ఇలా

  ఇదిలా ఉండగా, ఇటీవల నాగార్జున అక్కినేని ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనం వెలువడింది. విడాకుల తీసుకోవాలని సమంత మొదటి నిర్ణయం తీసుకొన్నారు. 2021 న్యూ ఇయర్ పార్టీ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. దాంతో సమంత నిర్ణయాన్ని నాగచైతన్య అంగీకరించారు. విడాకుల తీసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి ముందు నా గురించి చాలా బాధపడ్డారు. సమంతకు విడాకులు ఇస్తే ఫ్యామిలీ ప్రతిష్ట దెబ్బ తింటుందనే ఆందోళనకు గురయ్యారు అని నాగార్జున చెప్పినట్టు కథనం మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.

  నాన్సెన్స్.. రూమర్లు ప్రచారం చేయొద్దు

  అయితే సమంత, చైతూ విడాకుల గురించి తాను చెప్పినట్టుగా వస్తున్న కథనాలను నాగార్జున తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ ద్వారా నాగ్ స్పందిస్తూ.. సమంత, నాగచైతన్య గురించి నేను చెప్పినట్టు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. పూర్తిగా నిరాధారం. నాన్సెన్స్. ఇలాంటి వార్తలకు దూరంగా ఉండాలని మీడియా మిత్రులకు నా విన్నపం. మీరు వార్తలు ప్రసారం చేయండి.. రూమర్లు కాదు అంటూ నాగార్జున అక్కినేని ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు.

  బంగార్రాజుతో నాగ్, చైతూ బ్లాక్ బస్టర్

  బంగార్రాజుతో నాగ్, చైతూ బ్లాక్ బస్టర్

  ఇదిలా ఉండగా, సంక్రాంతి కానుకగా నాగచైతన్య, నాగార్జున నటించిన బంగర్రాజు చిత్రం రిలీజైంది. ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం గత రెండు వారాల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 33.52 కోట్లు నికరంగా, 54.60 కోట్లు గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 36.7 కోట్లు నికరంగా, 61.55 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

  English summary
  Nagarjuna Akkineni clarity with tweet on Samantha Ruth Prabhu and Naga Chaitanya divorce contraversy. The news in social media and electronic media quoting my statement about Samantha & Nagachaitanya is completely false and absolute nonsense!! I request media friends to please refrain from posting rumours as news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion