అందుకే అఖిల్ ముఖం చాటేస్తున్నాడు.. అసలు విషయం బయటపెట్టిన నాగార్జున!
ప్రతీ భాషకి చెందిన సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు సీనియర్ స్టార్ హీరోస్ ఉంటే వారి నుంచి వారి వారసులు కూడా ఇండస్ట్రీ లోకి రావడం అనేది ఆనవాయితీగా కనిపిస్తుంది. అలానే మన తెలుగు సినిమాకి సంబంధించి కూడా చాలా మందే సీనియర్ హీరోలు వారి వారసులు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఇంకా వస్తున్నారు. అయితే ఒకే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అందరికీ సమానమైన క్రేజ్ దక్కుతుంది అనుకుంటే అది పొరపాటే అవుతుంది.
ఇందుకు చక్కని ఉదాహరణగా అక్కినేని ఫ్యామిలీ నుంచే తీసుకుందాం. కింగ్ నాగార్జునకి ఫ్యామిలీ అడియన్స్ లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు మాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు కానీ ఇప్పుడు యువతలో తన వారసులని అభిమానించే వారు ఉన్నారు. కాగా ఇప్పుడు అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, నాగ చైతన్య అలాగే అఖిల్ అక్కినేనిలు ఇండస్ట్రీలో ఉన్నారు.

అయితే నాగార్జున, నాగ చైతన్యలకి సొంతం కానీ మాస్ క్రేజ్ అండ్ భారీ మార్కెట్ ని అఖిల్ సొంతం చేసుకున్నాడు. ఇదెలా అంటే చాలా మందికి సరైన సమాధానం దొరక్కపోవచ్చు కానీ అఖిల్ తన డెబ్యూ చిత్రంతోనే రికార్డులు తిరగరాశాడు. చాలా కాలం తర్వాత ఒక హీరో వారసుడి ఎంట్రీ కోసం టోటల్ టాలీవుడ్ ఎదురు చూసింది ఎవరికోసం అయినా ఉంది అంటే అది అఖిల్ అక్కినేని కోసమే అని చెప్పొచ్చు.
ఇంకా మిగతా అక్కినేని హీరోస్ తో అఖిల్ అంటే తన సినిమాలకి ఈజీగా బిజినెస్ జరిగిపోతుంది. ఒకవేళ ప్లాప్ పడినా కూడా అఖిల్ మార్కెట్ ఏమాత్రం చెదరకపోగా ఎక్కువై కంటిన్యూ అవుతుంది. సరే ఇన్ని ఉన్నా కూడా అఖిల్ విషయంలో బాధాకరమైన విషయం ఏదన్నా ఉంది అంటే అది తనకి ఇప్పటికీ ఒక సరైన హిట్ లేకపోవడమే అని చెప్పాలి. కాగా అఖిల్ నటించిన గత చిత్రం "ఏజెంట్" ఘోరమైన డిజాస్టర్ అయ్యింది.
దీనితో అక్కడ నుంచి ఫ్యాన్స్ పెద్దగా అఖిల్ బయట కనిపించింది లేదు. అంతే కాకుండా ఫ్యాన్స్ తో కలిపి చేసే ఏవైనా ఈవెంట్స్ కి కూడా అఖిల్ హాజరు కావడం లేదు. దీనితో అఖిల్ ఎందుకు కనిపించడం లేదు అనే మాటకి తన తండ్రి అక్కినేని నాగార్జున ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.
అఖిల్ హిట్ కొట్టాకే అభిమానుల ముందు వస్తానని చెప్తున్నాడు అని హిట్ లేకుండా తన మొహాన్ని అభిమానులని ఎలా చూపిస్తాను అంటూ హిట్ కొట్టిన తర్వాతే తమ అభిమానుల ముందుకు వస్తానని చెప్పినట్టుగా కింగ్ నాగ్ తెలిపారు. దీనితో అఖిల్ ఒక హిట్ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడు అనేది మనం అర్ధం చేసుకోవచ్చు.
కాగా ఇపుడు అఖిల్ లాస్ట్ సినిమా ఏజెంట్ భారీ ప్లాప్ అయినప్పటికీ కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ మేకర్స్ 100 కోట్లకి పైగా బడ్జెట్ తో అఖిల్ పై సాలిడ్ ప్రాజెక్ట్ ని చేస్తున్నట్టుగా టాక్ ఉంది. మరి ఈ సినిమాతో అయినా అయ్యగారు కోరుకుంటున్న హిట్ అందుకొని ఫ్యాన్స్ ముందు రావాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











