మా నాన్న నాకు ఆ మాట చెప్పారు.. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొడుతున్నాం.. నాగార్జున అక్కినేని
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హీరోగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు, సహ నిర్మాత పవన్ కుమార్ నిర్మించిన చిత్రం నా సామిరంగ. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ..
అక్కినేని అభిమానులందరికి నమస్కారం. మా నా సామిరంగ సినిమా గురించి మాట్లాడే మందు తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడాలని అనుకొంటున్నాను. సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడో టీవీలు వచ్చాక సినిమాలు ఎవరు చూడరని అన్నారు. ఆ తర్వాత సీడీలు టెక్నాలజీ వచ్చింది సినిమాలు చూడరు అన్నారు. కోవిడ్ వచ్చింది సినిమాలు చూడరు అన్నారు. కానీ సినిమాలు చూస్తూనే ఉన్నారు.

సంక్రాంతి పండుగ రోజున సినిమాలు చూడటం ఆనవాయితీగా మారింది. ఈ పండుగకు నాలుగు సినిమాలు వస్తున్నాయి. సినిమా పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో వస్తున్నాడు. బాలనటుడి నుంచి హీరో అయిన తేజా సజ్జా హనుమాన్ సినిమాతో వస్తున్నాడు. తన కెరీర్‌లో 75వ సినిమా సైంధవ్ మూవీతో వెంకీ వస్తున్నాడు. మేము పండుగ రోజున నా సామిరంగ సినిమాతో వస్తున్నాం అని నాగార్జున అన్నారు
గత రెండు సంక్రాంతి పండుగలకు నాకు రెండుసార్లు విజయం అందించారు. ఈ మూడో సంక్రాంతి కూడా హిట్ రాబోతున్నది. మా సినిమాకు హీరో కీరవాణి గారు. ఆయన అందించిన పాటలు బాగా చేశారు. ఈ సినిమాను మూడు నెలల్లో పూర్తి చేశామంటే.. ఆయన మా వెనుక ఉండి నడిపించారు. సినిమా పూర్తికాకుండానే మూడు పాటలు, ఓ ఫైట్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాంటి టెక్నిషియన్ ఉంటే మూడు నెలల్లో సినిమా పూర్తి చేయవచ్చు అని నాగార్జున అన్నారు.
మా నాన్న శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన సమయంలో.. నా మనసులోకి వచ్చి ఈ సినిమా చెయ్యరా.. నా సామిరంగ అని చెప్పారు. ఆయన ఆశీస్సులతో సినిమాను పూర్తి చేశాను. ఈ సినిమాలో పనిచేసిన వారి గురించి సినిమా సక్సెస్ మీట్‌లో చెబుతాను. అంతేకాకుంబా 3 నెలల్లో సినిమా ఎలా తీయవచ్చో పుస్తకం రాసి చెబుతాను. ఈ సంక్రాంతికి కిష్టయ్య వస్తున్నాడు. బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్నాడు అని నాగార్జున అన్నారు.


Click it and Unblock the Notifications











