భేషరతు క్షమాపణ చెప్పిన నాగార్జున అక్కినేని.. జంటిల్మెన్ అంటే అదే కదా!

సినీ తారలంటే అభిమానులకు, ప్రేక్షకులకు చెప్పలేనంత క్రేజ్. అయితే వారు పబ్లిక్‌లోకి వస్తే ఫ్యాన్స్ నుంచి తట్టుకోవడం చాలా కష్టం. అందుకే వారు చుట్టూ బాడీ గార్డులను పెట్టుకొంటారు. ఎవరైనా మీదకు వస్తే.. కాస్త సున్నితంగా వారిని దూరంగా పెడుతారు. ఒకవేళ హీరో, హీరోయిన్ ఒప్పుకొంటే వారికి దగ్గరకు పిలిచి ఫోటోనో, సెల్పీనో దిగి ఆనందింప చేస్తుంటారు. అయితే తాజాగా ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనపై నాగార్జున క్షమాపణ చెప్పడంతో ఆ వివాదానికి తెరపడింది. ఆ వివరాల్లోకి వెళితే..

అక్కినేని నాగార్జున ఏదో వ్యక్తిగత పని మీద ఏదో నగరానికి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టులో కనిపించారు. నల్లటి ష్టర్, గ్రే కలర్ పాయింట్, బ్లాక్ కళ్లజోడు పెట్టుకొని పేరు తగినట్టే నవ మన్మథుడిలా కనిపించారు. మెడకు బ్యాగ్ వేసుకొని ఏదో ఆలోచించుకొంటూ వెళ్తున్నారు. అయితే ఆయన చూసి అభిమానులు ముచ్చటపడ్డారు.

Nagarjuna Akkineni rendered Apologise to A Gentleman in Airport Incident

ఇక నాగార్జునతో ఫోటో తీసుకొనేందుకు ఓ అభిమాని ప్రయత్నించారు. అయితే నాగ్ వద్దకు పరుగున రావడంతో బాడీ గార్డు అడ్డుకొన్నాడు. అంతేకాకుండా ఆ యువకుడిని దురుసుగా వెనుకకు విసిరికొట్టాడు. దాంతో ఆ అబ్బాయి కిందపడిపోయినంత పనైంది. అయితే ఈ విషయం నాగార్జున దృష్టికి రాకపోవడం గమనార్హం.

అయితే ముంబైకి చెందిన ఫోటో జర్నలిస్టు వైరల్ భయానీ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నాగార్జున గారు.. మీలో మానవత్వం ఎక్కడికి పోయింది. అంటూ ప్రశ్నించాడు. పోస్టు పెట్టిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఆ విషయం తన దృష్టికి రావడంతో నాగార్జున స్పందించారు.

యువకుడిని దురుసుగా తోసిన ఘటన నాకు లేటుగా నోటీస్‌కు వచ్చింది. అలా జరిగి ఉండాల్సింది కాదు. ఆ యువకుడికి నేను క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకొంటాను అని వైరల్ భయానీ పోస్టుకు సమాధానం ఇచ్చారు. దాంతో తాను జెంటిల్మన్ అని మరోసారి నాగ్ నిరూపించుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X