Naa Saami Ranga 64 ఏళ్ల వయసులో మన్మథుడిలా ఉన్నానంటే.. హెల్త్ సీక్రెట్ రివీల్ చేసిన నాగార్జున అక్కినేని

సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని సినిమా ఉండాలని ప్రేక్షకులు కోరుకొంటారు. పండుగ సినిమా అంటే తెలుగుదనం ఉట్టిపడేలా నాగార్జున తన సినిమాలను ఆడియెన్స్‌కు అందిస్తుంటారు. తాజాగా ఆయన నటించిన నా సామిరంగ చిత్రం జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ తన అందం, ఫిట్‌నెస్, ఆరోగ్యం కనిపించడం వెనుక సీక్రెట్స్ వెల్లడించారు. నాగ్ చెప్పిన సీక్రెట్స్ ఏమిటంటే?

నాగార్జునకు టాలీవుడ్‌లో మన్మథుడు అనే ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్‌కు తగినట్టుగానే 64 ఏళ్ల వయసులోను ఆయన చెక్కుచెదరని లుక్‌ను మెయింటెన్ చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంటుంది. ఇంకా నవమన్మథుడిలా ఉండటం వెనుక తన ఆసక్తిని ఆపుకోలేక ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి అడిగిన ప్రశ్నకు తన ఆరోగ్య చిట్కాలను వెల్లడించారు.

Nagarjuna fitness tips

నేను రోజు రాత్రి భోజనం మానేస్తానని అందరూ అనుకొంటారు. కానీ నేను రాత్రి భోజనం చేస్తాను. కానీ రాత్రి 7 గంటల లోపే భోజనం ముగిస్తాను. రైస్, కూరగాయలు, చికెన్, మటన్ అన్నీ తింటాను. అయితే అవన్నీ చాలా క్రమ శిక్షణతో భోజనాన్ని ఆస్వాదిస్తాను అని నాగార్జున అన్నారు.

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు టిప్స్ ఏమీ లేవు. మన రోజు వారి జీవన విధానమే ఆరోగ్యంగా, పుష్టిగా ఉంచుతుంది. అలాగే వైట్ రైస్ తినను. బ్రౌన్ రైస్ తింటాను. నెయ్యి వేసుకొని భోజనం చేస్తాను. ప్రతీ రోజు మూడు ఆకు కూరలతో కర్రీస్ ఉంటాయి. భోజనంలో పెరుగు ఉంటుంది. తొక్కు పచ్చడి ఎక్కువగా తింటాను. కడుపు నిండా భోజనం చేస్తాను. కడుపు ఎట్టి పరిస్థితుల్లో మార్చుకొను అని నాగార్జున తెలిపారు.

అయితే పుష్టిగా భోజనం చేసినప్పటికీ.. ప్రతీ రోజు వర్కవుట్స్ చేస్తాను. లేకపోతే మెటాబాలిజం పెరిగిపోతుంది. 35 ఏళ్లుగా ఎక్సర్‌సైజులు చేస్తుంటాను. రాత్రి రెండు పెగ్గులు వేసి పడుకొంటాను. అలాగే స్వీటు తినకుండా నిద్రపోను అని నాగార్జున అక్కినేని చెప్పాను.

Nagarjuna Akkineni reveals health, Fitness Secret in Naa Saami Ranga promotions

నాగార్జున అక్కినేని విషయానికి వస్తే.. 1961లో తన ఎనిమిది నెలల వయసులో వెలుగు నీడలు సినిమా కోసం ఆయన కెమెరా ముందుకు వచ్చారు. 1986 సంవత్సరంలో విక్రమ్ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి నా సామిరంగ వరకు అనేక పాత్రల్లో నటించారు. ఇప్పటికీ 64వ వయసులో ఆయన కనిపించే విధానం అందర్నీ ఆకట్టుకొంటున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X