100 కోట్ల పరువు నష్టం దావా.. నాంపల్లి కోర్టుకు నాగార్జున అక్కినేని!

అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సమంత రుత్ ప్రభుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని మీడియా ముందు వెల్లడించిన విషయాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. తెలుగు సినీ ప్రముఖులంత ఒక్క వేదికపైకి వచ్చి కొండా వ్యాఖ్యలను ఖండించారు. అయితే తన కుటుంబ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం తెలిసిందే. ఆ పిటషన్‌ను తాజాగా కోర్టులో విచారణ జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఇటీవల ఓ సమావేశంలో కలుసుకోన్నారు. ఆ సందర్భంగా అక్కా అంటూ కొండా మెడలో దండ, శాలువా కప్పి రఘునందన్ రావు గౌరవించారు. అయితే ఆ ఫోటోను ట్రోల్ చేస్తూ బీఆర్ఎస్ అనుకూల వర్గం.. వారికి షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాల ద్వారా లబ్ది చేకూరేలా చేయాలి అంటూ తీవ్రమైన పదజాలాన్ని ఆమెపై ఉపయోగిస్తూ పరువు దిగజారేలా చేశారు.

Nagarjuna Akkineni to attend Nampally Court in 100 crores defamation on Konda Surekha

అయితే ఆ విషయంలో సహనం కోల్పోయిన కొండా సురేఖ.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారనే కోణంలో కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే ఆ సమయంలో నిగ్రహం కోల్పోయిన ఆమె.. సమంత, నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్.. ఎన్ కన్వెన్షన్ విషయంలో సమంతను నాగార్జున, నాగచైతన్య కలిసి కేటీఆర్ వద్దకు పంపించే ప్రయత్నం చేశారని తీవ్రమైన ఆరోపణలు చేసింది.

అయితే తన ప్రతిష్టకు, తన కుటుంబ పరువుకు భంగం కలించారనే ఆరోపణలపై కొండా సురేఖపై నాగార్జున అక్కినేని 100 కోట్లకుపైగా పరువు నష్టం దావా వేశారు. ఆ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టులోని మనోరంజన్ కోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. ఈ దావా కేసులో నాగార్జున తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు.

కొండా సురేఖఫై పరువు నష్టం దావా కేసులో వాదనలు విన్న కోర్టు.. బాధితుడు నాగార్జున అక్కినేని వాగ్మూలాన్ని నమోదు చేయాలని సూచించింది. దాంతో మంగళవారం క్లయింట్ స్టేట్‌మెంట్ నమోదు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా సాక్షుల స్టేట్‌మెంట్స్ కూడా రికార్డు చేయాలని సూచించింది. దాంతో ఈ ఈ కేసు విచారణను రేపటికి (అక్టోబర్ 8వ తేదీకి) వాయిదా వేసింది.

పరువు నష్టం దావా కేసులో మంగళవారం నాగార్జున అక్కినేని నాంపల్లిలోని మనోరంజన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో స్టేట్‌మెంట్ రికార్డింగ్ కోసం నాగ్ కోర్టు వస్తాడా? లేదా న్యాయవాది వాగ్మూలాన్ని నమోదు చేసి కోర్టుకు సమర్పిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఈ పరువు నష్టం దావా కేసులో కొండా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X