Bangarraju ఏడుగురి హీరోయిన్లతో బంగార్రాజు రొమాన్స్.. మన్మధుడు అక్కినేని నాగార్జున క్లారిటీ

సంక్రాంతి పండుగ బరిలో దూకేందుకు బంగార్రాజు సిద్దమయ్యారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, ఫరీదా అబ్దుల్లా నటించిన ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన బంగార్రాజు సినిమాను జనవరి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నామని అక్కినేని నాగార్జున రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నాగార్జున అక్కినేని మాట్లాడుతూ..

 పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడను

పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడను

ఆంధ్రప్రదేశ్‌లోని టిక్కెట్ల రేట్ల వ్యవహారంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సినిమా వరకు టికెట్ రేట్ల సమస్య లేదు. సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ వేదిక మీద నేను ఆ విషయాలు మాట్లాడను. కమర్షియల్‌గా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కువ వస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని నాగార్జున అన్నారు.

 అలాంటి పరిస్థితి వస్తుందని ఊహించను

అలాంటి పరిస్థితి వస్తుందని ఊహించను

సంక్రాంతి పండుగకు ముందు పలు రాష్ట్రాల్లో 50 శాతం అక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూలు పెడుతున్నారనే విషయం తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. అలాంటి పరిస్థితి వస్తుందని ఊహించడం లేదు. నేను పాజిటివ్‌గా ఆలోచిస్తాను. ఏం జరుగుతుందో వేచి చూడాలి. అంతా సవ్యంగా జరుగుతుందనే అనుకొంటున్నాను. ఇప్పుడే ముందు ఏం జరుగుతుందో ఆలోచించడం సరికాదు అని నాగార్జున అన్నారు.

RRR, రాధేశ్యామ్ వచ్చినా

RRR, రాధేశ్యామ్ వచ్చినా

RRR, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ అయినా మేము బంగర్రాజు సినిమాను రిలీజ్ చేసేవాళ్లం. ఆ రెండు సినిమాలు వస్తున్నాయంటే ఇంకా ధైర్యం ఉండేది. అంటే బయట వాతావరణం సినిమాలకు అనుకూలంగా ఉంటుందనే ఆశాభావం ఉండేది. గతంలోనే సంక్రాంతికి మూడు, నాలుగు సినిమాలు వచ్చిన సందర్బాలు ఉండేవి. సొగ్గాడే చిన్ని నాయనా సినిమా రిలీజ్ సమయంలో నాలుగు సినిమాలు వచ్చాయి అని నాగార్జున గుర్తు చేశారు.

 ఏడుగురు హీరోయిన్లతో రొమాన్స్

ఏడుగురు హీరోయిన్లతో రొమాన్స్

సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో అనుష్క శెట్టి స్పెషల్ ఎంట్రీ మాదిరిగా చాలా సర్‌ప్రైజ్ ఎంట్రీలు చాలా ఉంటాయి. ఏడుగురు హీరోయిన్లతో రొమాన్స్ ఉంటుంది. ఆ ఏడుగురు హీరోయిన్లు ఎవరనేది తెరపైనే చూడాలి. ఈ చిత్రంలో చాలా స్పెషల్ మూమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. క్లైమాక్స్‌లో అఖిల్ ఎంట్రీ ఉంటుందనే వార్తల్లో నిజం లేదు అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

Recommended Video

83 Movie Promotions : Ranveer Singh Fun With Kapil Dev And Nagarjuna | Filmibeat Telugu
బంగార్రాజులో నటీనటులు, సాంకేతిక వర్గం

బంగార్రాజులో నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు: నాగార్జున అక్కినేని, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరీ తదితరులు
రచన, దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ
సినిమాటోగ్రఫి: జే యువరాజ్
ఎడిటింగ్: విజయ్ వర్ధన్ కే
మ్యూజిక్: అనుప్ రూబెన్స్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2022-01-14

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X