చిరంజీవి, ప్రభాస్ కాదు.. సౌత్ లో రిచ్చెస్ట్ హీరో నాగార్జున.. ఆస్తులు విలువ ఎన్ని వేల కోట్లంటే?
Nagarjuna Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వారికి అభిమానులు కూడా అదే రేంజ్ ఉన్నారు. ప్రతి ఒక్క హీరో తాము చేసే సినిమాలు, వ్యాపార ప్రయత్నాల ద్వారా ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు. అలాగే.. తమ అభిమానుల అనుగుణంగా, ఇండస్ట్రీలో ఎదురయ్యే పోటీని బట్టి సినిమాలు చేస్తారు. విజయాలకు అనుగుణంగా రెమ్యూనరేషన్లు తీసుకున్నారు. అధిక మొత్తం కూడబెడుతున్నారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ధనిక నటులు ఉన్నాయి. అయితే.. అత్యధిక సంపాదన హీరో ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు, ఇతర వ్యాపారాలు, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తారు. ముఖ్యంగా చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్ వంటి ప్రముఖ నటులు దక్షిణ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలుగా నిలుస్తున్నారు. వారి సినిమాలు, వ్యాపార ప్రకటన ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్న నటుల జాబితా సరికొత్తగా వెలుగులోకి వచ్చింది. ఈ జాబితాలో ఎవరూ ఊహించని విధంగా నాగార్జున అక్కినేని అగ్రస్థానంలో నిలిచాడు.

సౌత్ ఇండియాలో అత్యంత సంపన్న సూపర్ స్టార్‌గా నాగార్జున (Nagarjuna Akkineni) నిలిచాడు. తాజా సమాచారం ప్రకారం నాగార్జునకు సుమారు ₹3,572 కోట్లు (410 మిలియన్ డాలర్లు) విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఆయన ఆస్తుల పరంగా కేవలం చిరంజీవి, ప్రభాస్ వంటి టాలీవుడ్ నటులనే కాకుండా.. బాలీవుడ్ సూపర్ స్టార్‌లైన అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లను మించిపోయారు కింగ్ నాగార్జున.
నాగార్జున ప్రధానంగా సినిమాలు, వ్యాపార పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు, బ్రాండ్ ప్రకటన ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఆయన యజమాన్యంలోని అన్నపూర్ణ స్టూడియోస్ టాలీవుడ్‌లో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌గా ఉంది. అలాగే N3 రియాల్టీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నాగార్జునకు ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లు, మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువే దాదాపు ₹900 కోట్లకు పైమాట.
కింగ్ నాగార్జున టాలీవుడ్ లో మన్మథుడిగా
అక్కినేని నాగార్జున 40 ఏళ్లకు పైగా సినీ కెరీర్‌తో టాలీవుడ్‌లో సత్తా చాటుతూ వస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడి, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రేక్షకులను ఆకర్షిస్తూ "మన్మథుడు"గా నిలిచారు. కింగ్ నాగార్జున కెరీర్‌లో శివ, క్రిమినల్, మనం, సంతోషం, నిన్నే పెళ్లడతా, మాస్, అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయన వంటి అనేక హిట్స్ చిత్రాలు ఉంటాయి. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, అన్నమయ్య, రామదాస్ వంటి డివోషనల్ చిత్రాల ద్వారా సరికొత్త ప్రయోగాలు చేశారు. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలకు జీవం పోసి, నటనలో నిత్యం నవీనతను చేర్చుతూ కింగ్ నాగార్జున టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
నాగార్జున 100వ సినిమా
సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో 100వ సినిమాను 'లాటరీ కింగ్' టైటిల్‌తో సెట్స్‌పైకి తీసుకువచ్చారు. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుంది. నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తోంది. వర్కింగ్ టైటిల్ 'కింగ్-100' నుంచి చివరికి 'లాటరీ కింగ్'గా ఖరారు చేయబడిన ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతోంది.


Click it and Unblock the Notifications











