Adipurush జై శ్రీరాం అంటూ నాగార్జున ఎమోషనల్.. ప్రభాస్, ఆదిపురుష్ గురించి సెన్సేషనల్ కామెంట్

ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, ఆనంద్ భట్ సమర్పణలో విక్రమ్ భట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కృష్ణ భట్ దర్శకత్వంలో యువ హీరోయిన అవికా గోర్ నటించిన చిత్రం 1920. హారర్ ఎలిమెంట్స్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన థ్రిలర్ జూన్ 23వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. తెలుగు, హిందీలో రిలీజవుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈవెంట్‌లో నాగార్జున అక్కినేని ముఖ్య అతిథిగా, మహేష్ భట్, కృష్ణా భట్, అవికా గోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..

మహేష్ భట్‌ను చాలా రోజుల తర్వాత కలిశాం. మేమిద్దరం కలిసి జకమ్ అనే సినిమా చేశాం. ఆ మధ్య అప్పుడప్పుడు మాట్లాడాను. దాదాపు మేమిద్దరం కలిసి 25 సంవత్సరాలు అయింది. కానీ ఆయన ఎప్పుడూ మనసులో ఉంటారు. ఆయన మనసులో నేను కూడా ఉంటానని అనుకొంటాను. ముంబై వెళ్లి షూటింగులు చేసినప్పుడు మహేష్ భట్‌ను గురించి ఆలియా భట్‌ను అడిగి తెలుసుకొన్నాను అని నాగార్జున చెప్పారు.

ఆలియాభట్‌తో మాట్లాడినప్పుడు మా ఇద్దరి గురించిన చాలా విషయాలు షేర్ చేసుకొన్నాను. 25 ఏళ్ల క్రితం క్రిమినల్, జకమ్ షూటింగుల్లో జరిగిన చాలా విషయాలు ఆలియాకు చెప్పాను. మహేష్ భట్‌కు నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన గురించి మాట్లాడటానికి నాకు మాటలు రావడం లేదు. ఆయన చేసే వర్క్, పనులు చూసి నేను ఎంతో స్పూర్తిని పొందుతూనే ఉన్నాను అని నాగార్జున అన్నారు.

నా గురూజీ మహేష్ భట్ నుంచి ఎంతో మంది డైరెక్టర్లు వచ్చారు. ఇప్పుడు ఆయన మనవరాలు కృష్ణా భట్ 1920 సినిమా తీశారు. ఈ సినిమా వెనుక మహేష్ భట్ ఉండటం ఆనందంగా ఉంది. ఆయన రాయించే పాటలు నాకు చాలా ఇష్టం. క్రిమినల్ సినిమాలో తెలుసా? మనసా? పాటను కీరవాణితో కలిసి చేయించుకొన్నారు. తెలుగు తెలియకపోయినా ఆ పాటలోని ఎమోషన్స్‌ను చక్కగా అర్ధం చేసుకొన్నారు అని నాగార్జున చెప్పారు.

Nagarjuna Akkineni wishes Prabhas by saying Jai Sriram for Adipurush success

జకమ్ సినిమాలో గలీ మే నిక్లా చాంద్ అనే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట కోసం చేసిన షూటింగ్ గురించి నాకు ఇంకా కొన్ని మెమొరీలు ఉన్నాయి. ఆ పాటను మొన్నీ మధ్య షూట్ చేసినట్టు అనిపిస్తున్నది. ఇంకా ఆ పాట చిత్రీకరణ సన్నివేశాలు నాకు గుర్తుకు వస్తున్నాయి. ఆయన క్వాలిటీ చాలా బాగుంటుంది అని నాగార్జున అన్నారు.

1920 మూవీ జూన్ 23వ తేదీన వస్తున్నది. అలాగే జూన్ 16వ తేదీన మరో పెద్ద సినిమా వస్తున్నది. ఆదిపురుష్ సినిమా భారీ విజయం సాధించాలి. ప్రభాస్‌కు మంచి సక్సెస్ రావాలి. ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ కావాలి. ప్రేక్షకులను మళ్లీ థియేటర్‌కు రప్పించాలి అని నాగార్జున అక్కినేని విష్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X