Nagarjuna: ‘ధురంధర్'లో విలన్ రోల్ మిస్.. నాగార్జున క్లారిటీ
బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మూవీ ధురంధర్(Dhurandhar).డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీ దాదాపు రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. హీరోగా రణ్‌వీర్ నటనతో పాటు, విలన్ పాత్రలో అక్షయ్ ఖన్నా ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే.. అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ డకాయిట్ అనే నెగిటివ్ పాత్రకు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫస్ట్ ఛాయిస్ అనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై కింగ్ నాగార్జున స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
ధురంధర్(Dhurandhar) సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)పేరు అనూహ్యంగా వైరల్ అయింది. ఈ సినిమాలో ప్రతినాయకుడు రెహమాన్ డకాయిట్ పాత్రను ముందుగా నాగార్జునకే ఆఫర్ చేశారని, కానీ 'కూలీ' సినిమా కారణంగా ఆయన ఆ అవకాశాన్ని వదులుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. హీరో రణ్ వీర్ సింగ్ సరసన ఆ నెగెటివ్ షేడ్ రోల్‌లో మెరిసిన అక్షయ్ ఖన్నా నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో... 'ఈ పాత్ర నాగ్ చేసి ఉంటే ఎలా ఉండేదో?' అనే చర్చ కూడా మొదలైంది.

ఈ నేపథ్యంలో నాగార్జున తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. 'అలాంటిదేమీ లేదు. నన్ను ఆ పాత్ర కోసం ఎవరూ సంప్రదించలేదు. కానీ అడిగితే బాగుండేదేమో! 'ధురంధర్' నిజంగా అద్భుతమైన సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వం అమోఘం. అందరూ బాగా నటించారు... ముఖ్యంగా అక్షయ్ ఖన్నా అయితే సినిమాకే హైలైట్,'అని నాగ్ ఓపెన్‌గా చెప్పారు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) పనితీరును కూడా నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆదిత్య ధర్ గత సినిమా ఉరి(Uri: The Surgical Strike) కూడా తనకు చాలా ఇష్టమని తెలిపారు.
అంతేకాదు, 'ధురంధర్ 2' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, సీక్వెల్ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. 'ధురంధర్' విడుదల తర్వాత అక్షయ్ ఖన్నా చేసిన రెహమాన్ డకాయిట్ పాత్ర ఒక బెంచ్‌మార్క్‌గా మారింది. కొందరైతే రణవీర్ సింగ్‌ను కూడా తన పెర్ఫార్మెన్స్‌తో డామినేట్ చేశారని అభిప్రాయపడ్డారు. ఈ పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌తో అక్షయ్ ఖన్నా మళ్లీ సూపర్ ఫామ్‌లోకి వచ్చారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయన అదే క్యారెక్టర్‌తో సీక్వెల్‌లోనూ కనిపించనున్నట్లు సమాచారం.
ఇక నాగార్జున కెరీర్ విషయానికి వస్తే... ప్రస్తుతం ఆయన తన మైలురాయి 100వ సినిమాలో బిజీగా ఉన్నారు. రా.కార్తీక్ దర్శకత్వంలో 'King100'అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. 'ఇది నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీ. అందుకే ఎలాంటి తొందర లేదు. సినిమాను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం,' అని చెప్పారు. అలాగే 'ధురంధర్' లాంటి సినిమాల తర్వాత భారతీయ ప్రేక్షకులు అంతర్జాతీయ స్థాయి సినిమాలు కోరుకుంటున్నారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కింగ్ నాగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











