నాగార్జున రెమ్యూనరేషన్ లీక్: చిరంజీవి, బాలయ్యకు అన్ని కోట్లు.. మరి కింగ్ తీసుకునేది ఎంతంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను ఏర్పరచుకోవడంతో పాటు మార్కెట్‌ను కూడా పెంచుకుంటూ వెళ్తోన్న స్టార్ హీరోనే కింగ్ అక్కినేని నాగార్జున. గతంలో వరుసగా సినిమాలు చేసి ఎన్నో విజయాలను అందుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయ్యారు. దీంతో ఆయన అభిమానులు నిరాశగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఆయన ఇప్పుడు 'నా సామిరంగ' మూవీతో సంక్రాంతి బరిలో నిలవబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో మీరు కూడా చూసేయండి మరి!
నా సామిరంగ సినిమాతో:టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రమే 'నా సామిరంగ'. విజయ్ బిన్నీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంక్రాంతి బరిలో స్పీడ్:కుటుంబ కథకు మాస్ అంశాలను జోడించి తెరకెక్కిస్తోన్న 'నా సామిరంగ' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇటీవలే దీన్ని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం షూట్‌ను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను స్పీడుగా చేస్తున్నారు. ఇలా దీన్ని సంక్రాంతి బరిలో నిలిపారు.
నైజాం రైట్స్ తీసుకుని:విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీకి సంబంధించిన హక్కులు కూడా ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్‌ను హీరో నాగార్జునే సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ద్వారా ఆయన ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.

నాగ్ రెమ్యూనరేషన్ లీక్:సరైన హిట్ కోసం వేచి చూస్తున్న అక్కినేని నాగార్జున.. ఇప్పుడు 'నా సామిరంగ'పై బాగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు. ఇక, ఈ సినిమా కోసం ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. దీని ప్రకారం.. నాగార్జున ఈ చిత్రానికి గానూ రూ. 10 కోట్లు చార్జ్ చేశారట.
ఆ సినిమాలకు ఎంత?:అక్కినేని నాగార్జునకు మంచి మార్కెట్, ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ విషయంలో మిగిలిన స్టార్లతో పోల్చుకుంటే కాస్త వెనుకబడే ఉన్నారు. అందుకే 'బంగార్రాజు' చిత్రం కోసం ఆయన రూ. 6 కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'ది ఘోస్ట్' మూవీకి రూ. 8 కోట్లు చార్జ్ చేశారు. ఇప్పుడేమో కాస్త పెంచుకుని రూ. 10 కోట్లు తీసుకున్నారని అంటున్నారు.

వాళ్ల కంటే తక్కువగానే:టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఏకంగా రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఆయన తర్వాత నందమూరి బాలకృష్ణ రూ. 28 కోట్లు చార్జ్ చేస్తున్నారు. వెంకటేష్ కూడా చాలా కాలం నుంచే రూ. 10 కోట్లు వసూలు చేస్తున్నారు. ఈ ముగ్గురు హీరోల కంటే నాగార్జున తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











