బంగార్రాజు కథతో మరో సీక్వెల్.. సైలెంట్ గా క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున!
ఇటీవల కాలంలో ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకు కొనసాగింపుగా చాలా డిఫరెంట్ సీక్వెల్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆ ట్రెండ్ ను కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి F2 సినిమా ఫార్మట్ లోనే ఇద్దరు స్టార్ హీరోలతో F3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత పుష్ప 2 కథకు కంటిన్యూగా సుకుమార్ సీక్వెల్ ను భారీ స్థాయిలో ప్రజెంట్ చేయబోతున్నాడు. ఈ సంక్రాంతికి బంగార్రాజు సినిమా కూడా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు కొనసాగింపుగా వస్తున్న విషయం తెలిసిందే.
తప్పకుండా బంగార్రాజు సినిమా పాత సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఒక స్ట్రాంగ్ నమ్మకంతోనే సినిమాని విడుదల చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తో పాటు ఈ సారి నాగచైతన్య సరికొత్త యువ బంగార్రాజు గా కనిపించబోతున్నాడు. తెలుగులో మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు తీసుకు వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సంక్రాంతి హడావిడి లో అత్యధిక స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ కూడా నాగార్జున మంచి హిట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక ఈ సారి అంతకుమించి అనేలా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటాడు అని అభిమానుల్లో కూడా ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఇక బంగార్రాజు సినిమాను ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుంచి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా చెబుతున్నారు. అయితే ఈ బంగార్రాజు సినిమాకు కూడా సీక్వెల్ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా నాగార్జున వివరణ ఇచ్చాడు. సోగ్గాడే చిన్న నాయనా సినిమాకు కొనసాగింపుగా వస్తున్న బంగార్రాజు కథను మరింత పొడిగించే అవకాశం లేకపోలేదని అన్నారు. సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు ఇక ఆ తరువాత తదుపరి కథను మళ్ళీ ఎలా సిద్ధం చేస్తారు అనేది అందరిలో ఒక సందేహాన్ని కలిగిస్తోంది.
నాగార్జున అయితే మొత్తానికి బంగార్రాజుకి కూడా సీక్వెల్ ఉండే అవకాశం ఉందని సైలెంట్ గా చెప్పడం కొంత ఆసక్తిని కలిగిస్తోంది. ఇక జనవరి 14 తేదీన రాబోయే బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అనేది కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తప్పకుండా మొదటి రోజు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. మరి అభిమానుల అంచనాలను నాగార్జున ఏ స్థాయిలో అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











