Samantha నాగచైతన్య విడాకుల వ్యవహారం.. మీడియా కథనాలపై నాగార్జున సీరియస్.. లీగల్ చర్యలు?
సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారం ప్రతి రోజు ఏదో ఒక విధంగా వార్తల్లోకి వస్తూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారం మీద నాగార్జున స్పందించినట్టు కొన్ని కామెంట్లు మీడియాలో సైతం ప్రసారం అయ్యాయి. అయితే ఈ విషయం మీద ఆయన సోషల్ మీడియా వేదికగా ఖండించారు. ఇక ఈ క్రమంలో ఆయన లీగల్ గా ముందుకు వెళ్లేందుకు యోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు

సమంతే అడిగి
గతేడాది అక్టోబర్2న సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఈ విషయంలో ఏదో ఒకరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత-నాగచైతన్య విడాకులకు సంబంధించి నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముందుగా విడాకులు కావాలని సమంతే అడిగిందని, నాగచైతన్య ఆమె నిర్ణయాన్ని గౌరవించి ఒప్పుకున్నట్లు వార్తలు ప్రసారం అయ్యాయి.

పూర్తి అబద్దం అంటూ
అయితే ఉదయం అంతా ఈ వార్తలు మీడియాలో రావడంతో దీనిపై నాగార్జున స్పందించారు. అవి పూర్తిగా తప్పుడు వార్తలు అంటూ కొట్టిపారేశారు. 'సమంత, నాగ చైతన్య విడాకులకు సంబంధించి నేను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తి అబద్దం. దయచేసి పుకార్లను వార్తలుగా ప్రచారం చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

కల్పితం అని
నాగార్జున చేసినట్టు ప్రసారం అయిన వార్తలు అన్నీ కల్పితం అని తెలుస్తోంది. బాలీవుడ్ హంగామాలో ప్రచురితం అయిన ఒక కథనం మేరకు నాగార్జున మాట్లాడుతూ "అసలు ముందుగా అది నా భాష కాదు. నా కొడుకుని 'నాగ చైతన్య' అని పిలవనని నాకు తెలిసిన వారందరికీ తెలుసు. రెండవది, ఈ భాష తెలుగు నుంచి అనువదించినట్టు ఉంది, కాబట్టి ఇది బహుశా కొన్ని నిరాశాజనకమైన చెత్త తెలుగు వెబ్‌సైట్స్ నుండి తీసుకోబడింది. ఈ అర్ధంలేని వార్త ఎక్కడ నుంచి వచ్చిందో కనుగొనే ప్రక్రియలో మేము ఇప్పుడు ఉన్నామని ఆయన తమకు వెల్లడించినట్టు వెల్లడించింది.

ఎవరి తోనూ మాట్లాడలేదు
ఈ వార్త చూసి తాను షాక్ అయ్యానని నాగ్ చెప్పారు. "సాధారణంగా నేను నా గురించి వ్రాసిన అర్థం లేని వాటికి ప్రతిస్పందించను. కానీ ఇది నా కుటుంబానికి సంబంధించినది. ఈ చెత్తను నేను సహించను. అందుకే ఈ విషయాన్ని సెట్ చేయాలనుకుంటున్నాను. నా కొడుకు మరియు సమంతపై వచ్చిన ఈ వార్తలు పూర్తిగా కల్పితం. దీని గురించి నేను ఎవరి తోనూ మాట్లాడలేదు. దాని గురించి నేను మరియు నా కుటుంబం ముందు నుంచి మౌనంగానే ఉన్నాం. ఇప్పుడు ఎందుకు మాట్లాడతాము ? అని ఆయన ప్రశ్నించారు.

చట్టపరమైన చర్యలు
నాగ్ టీమ్ ఇప్పుడు ఈ వార్త పుట్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే పనిలో పడింది. "ఈ వండిన కథనం అసలు ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. అని నాగార్జున తమకు చెప్పినట్లు సదరు వెబ్ సైట్ కథనంలో పేర్కొంది. చూడాలి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుంది అనేది.


Click it and Unblock the Notifications











