అఖిల్ సినిమా ఓటీటీ రిలీజ్.. నాగార్జున షాకింగ్ నిర్ణయం
టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. మొదటి మూడు సినిమాలు ఎంతో కష్టపడి చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక అఖిల్ కు మంచి హిట్ ఇప్పించాలని సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నాలు చేశాడు.
గీత ఆర్ట్స్ సపోర్ట్ తోనే GA2లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రెండేళ్ల క్రితం మొదలవ్వగా ఇంతవరకు రిలీజ్ కు నోచుకోలేదు. సగం కరోన వల్ల దెబ్బ పడింది. ఇక ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నట్లు గత కొన్ని రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

ఇప్పటివరకు సినిమా ఎలాంటి బజ్ క్రియేట్ చేసింది లేదు. థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అంటే మరో మూడు నెలలు ఆగాలి. ఇక ఆలస్యం చేస్తే ఓటీటీలో రిలీజ్ చేసినా లాభం ఉండదని నిర్మాతలు ఇటీవల చర్చలు జరపగా అందుకు నాగార్జున అడ్డు పడినట్లు సమాచారం. కొడుకు సినిమా మొదట థియేటర్స్ లోనే విడుదల అవ్వాలని గీతా ఆర్ట్స్ బన్నీ వాసుకి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిర్మాతలు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి. ప్రస్తుతం అఖిల్ తన 5వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











