Nagarjuna: అమ్మాయిలతో రొమాన్స్ ఇష్టమా? గన్స్ తో ఫైరింగ్ ఇష్టమా? అదిరిపోయిన నాగార్జున రిప్లై

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున తాజాగా నటించిన చిత్రం ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికీ ఈ మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. అందులో భాగంగానే ఇటీవల టీజర్ ను విడుదల చేసింది. ఇక తాజాగా శుక్రవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలిచ్చింది ది ఘోస్ట్ మూవీ యూనిట్. ఈ క్రమంలోనే అమ్మాయిలు, గన్స్ లో ఏదిష్టం అని అడగ్గా.. నాగార్జున ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

 పెరిగిన అంచనాలు..

పెరిగిన అంచనాలు..

అక్కినేని నాగార్జున మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమా దసరా ఫెస్టివల్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఇదివరకే టీజర్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ తో కూడా అంచనాల స్థాయిని మరింత పెంచింది.

పవర్ ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా..

పవర్ ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా..

ఈ ట్రైలర్ లో పవర్ ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్న నాగార్జున ఒక సీక్రెట్ ఆపరేషన్ నిమిత్తం తన సోదరిని అలాగే ఆమె కూతురిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా అలాగే మరికొంతమంది శత్రువులను ఎదుర్కొంటూ ఉంటాడు. నలువైపుల నుంచి శత్రువులు దాడి చేస్తూ ఉండగా వారి నుంచి తన సోదరీ కుటుంబాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమాలో ప్రధాన అంశంగా తెలుస్తోంది.

రొమాన్స్ ఎక్కువ ఇష్టమా..

రొమాన్స్ ఎక్కువ ఇష్టమా..

ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అనేక ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగానే ఓ జర్నలిస్ట్.. ''ఆన్ స్క్రీన్ మీద మీకు గర్ల్స్ తో రొమాన్స్ ఎక్కువ ఇష్టమా.. గన్ తో ఫైరింగ్ ఇష్టమా..'' అని నాటీ క్వశ్చన్ అడిగాడు. దీనికి కొద్దిసేపు నవ్వినా నాగార్జున.. ''ఒక చేతిలో అమ్మాయి.. మరో చేతిలో గన్ను'' అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో అక్కడ అందరూ కేకలు వేశారు.

సాంకేతిక అంశాలు కూడా..

సాంకేతిక అంశాలు కూడా..

ఇక ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు నాగార్జున. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి చూడాలంటే కంటెంటే తో పాటు సాంకేతిక అంశాలు కూడా చాలా బాగుండాలని తెలిపాడు నాగార్జున. అలాంటి టెక్నికల్ అంశాలతో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సినిమాను నింపేశాడని పేర్కొన్నాడు. ఇప్పటివరకు వచ్చిన విజువల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పుకొచ్చారు.

చాలా నమ్మకంగా ఉన్నాం..

చాలా నమ్మకంగా ఉన్నాం..

అలాగే ఈ మూవీని తామంతా చూశామని, అందుకే సినిమా గురించి చాలా నమ్మకంగా ఉన్నామని తెలిపాడు నాగార్జున. ఈ చిత్రంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రకరకాల పాత్రలు చేసిన వారున్నారన్నారు. ఇదిలా ఉంటే.. ది ఘోస్ట్ సినిమాను గత రెండు నెలల క్రితం విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి టీజర్ ట్రైలర్ అయితే అంచనాలను పెంచేసింది.

 జోడిగా సోనల్ చౌహన్..

జోడిగా సోనల్ చౌహన్..

దీంతో నాగార్జున తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అనిపిస్తోంది. గ్రాండ్ గా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా సోనల్ చౌహన్ నటించగా.. గుల్ పనగ్, అనికా సురేంద్ర, మనీష్ చౌదరి, రవి వర్మ అలాగే మరి కొంతమంది ప్రముఖ నటి నటీమణులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X