twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా మీద తీయ్, రకుల్‌ను వదిలేయ్... దర్శకుడిపై అరిచిన నాగార్జున! (వీడియో)

    |

    నాగార్జున సూపర్ హిట్ మూవీ 'మన్మధుడు' చిత్రానికి సీక్వెల్‌గా 'మన్మధుడు 2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    పోర్చుగల్‌లో షూటింగ్ జరుగుతున్నప్పటికీ నాగార్జున ఫిట్ నెస్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అక్కడ లోకల్ జిమ్‌లో జాయిన్ అయి ప్రతి రోజూ వర్కౌట్స్ చేస్తున్నారు. నాగార్జునతో పాటు రకుల్ కూడా క్రమం తప్పకుండా జిమ్‌లో గడుపుతున్నారు. ఇందుకు సంబంధించి నాగార్జున షేర్ చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది.

    నా మీద తీయ్, రకుల్‌ను వదిలేయ్... దర్శకుడిపై అరిచిన నాగార్జున!

    పోర్చుగల్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో నాగార్జున ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాహుల్ వచ్చి షాట్ రెడీ అయింది... రకుల్, మీరు రండి అని కోరగా నాగార్జున రియాక్ట్ అవుతూ నేను వస్తాను, రకుల్‌ను వదిలేయ్, ఆమె వర్కౌట్స్ చేస్తోంది అంటూ అరిచారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    రకుల్ మీద రూమర్స్ తర్వాత ఈ వీడియో

    రకుల్ మీద రూమర్స్ తర్వాత ఈ వీడియో

    కొన్ని రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన రూమర్ ఒకటి హాట్ టాపిక్ అయింది. రషెస్ చూసిన తర్వాత నాగార్జున... రకుల్ ప్రీత్ సింగ్ లుక్ విషయంలో అప్ సెట్ అయ్యాడని, ఈ విషయంలో దర్శకుడికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో నాగార్జున... రకుల్‌తో వర్కౌట్లు చేయిస్తూ వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది.

    రూమర్లపై క్లారిటీ ఇచ్చిన రాహుల్

    రూమర్లపై క్లారిటీ ఇచ్చిన రాహుల్

    రకుల్ విషయంలో వచ్చిన రూమర్లపై రాహుల్ రవీంద్రన్ ఆ వెంటనే క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. 'పోర్చుగీస్ షెడ్యూల్ తొలి రోజు నుంచి రకుల్ మాతో పని చేస్తోంది. ఆమె ఇంక్రెడబుల్ టాలెంట్ కలిగిన వ్యక్తి, నాగార్జున సర్ ఆమె గురించి ఎలాంటి కంప్లయింట్ చేయలేదు, ఆ పుకార్లలో నిజం లేదు' అని తెలిపారు.

    మన్మధుడు 2

    మన్మధుడు 2

    ‘మన్మధుడు-2' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎక్కువగా యూరప్‌లోనే జరుగుతోంది. ఇందులో అక్కినేని కోడలు సమంత కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు.

    English summary
    "Working out in Portugal with the beautiful Actress Rakul preet" Nagarjuna tweeted. Manmadhudu 2 stars Nagarjuna and Rakul Preet in lead roles, directed by Rahul Ravindran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X