twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన్మథుడు 2 కోసం యూరప్‌లో మకాం వేయనున్న నాగార్జున!

    |

    కింగ్ నాగార్జున దేవదాస్ చిత్రం తరువాత మరో చిత్రానికి సైన్ చేయలేదు. చిలసౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆ మధ్యన నాగార్జునకు ఓ స్టోరీలైన్ వినిపించాడని ప్రచారం జరిగింది. వార్తలు నిజమయ్యాయి. మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 టైటిల్ తో రాహుల్ రవీంద్రన్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కథ మొత్తం సిద్ధం కావడంతో నాగ్ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    ఈ చిత్రం గురించి తాజగా ఆసక్తికర వార్తలు వినిపిస్తన్నాయి. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లో జరగబోతోంది. దీనితో నాగార్జున, రాహుల్ రవీంద్రన్, ఇతర చిత్ర యూనిట్ మొత్తం రెండు నెలలపాటు యూరప్ లోనే మకాం వేయనున్నారు. ఫిబ్రవరి మూడవ వారంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరగనుంది. మార్చి ఆరంభం నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

     Nagarjunas Manmadhudu 2 movie long schedule in Europe

    నాగార్జున నటించిన చిత్రాల్లో మన్మథుడు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2002లో వచ్చిన ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు అందించారు. త్రివిక్రమ్ రాసిన కామెడీ పంచ్ లకు అప్పట్లో అద్భుత స్పందన లభించింది. చిత్ర విజయంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. మన్మథుడు చిత్రం నుంచి అందరూ నాగార్జునని ఆ పేరుతోనే పిలవడం ప్రారంభించారు. మన్మథుడు 2లో నాగార్జున సరసన నటించే హీరోయిన్ కోసం రాహుల్ రవీంద్ర వెతుకుతున్నాడు.

    English summary
    Nagarjuna's Manmadhudu 2 movie long schedule in Europe
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X