4 కోట్ల బడ్జెట్ 30 కోట్లకి పైగా వసూళ్లు..నాగార్జున వదులుకున్న భారీ బ్లాక్ బస్టర్ ఏంటో తెలుసా?

జెనరల్ గా ఏ సినిమా సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నా చాలా మంది హీరోలు లేదా హీరోయిన్స్ విషయంలో కానీ ఒకడు వదులుకున్న సినిమాలు మరొకరు చేసి భారీ హిట్స్ కొట్టిన వారు చాలా మంది ఉంటారు. ఇది అన్ని సినీ పరిశ్రమల్లో కూడా కనిపిస్తుంది. మొదటిగా ఓ దర్శకుడు ఓ హీరోకి కథ రాస్తే అది కాస్తా చాలా మలుపులు తిరిగి మరో హీరో దగ్గరకి వెళుతుంది. ఇలా మన తెలుగు సినిమాలో అయితే చాలామంది స్టార్ హీరోల సినిమాలే కనిపిస్తాయి.

కాకపోతే టాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాలు కూడా తెలుగు హీరోతోనే అనుకుని మరో తెలుగు హీరో దగ్గరకే వెళ్ళినవి ఉంటాయి. కానీ ఒక తెలుగు హీరోతో మొదటగా సినిమా అనుకోని అది హిందీ హీరో దగ్గరకి వెళ్లడం మాత్రం అక్కినేని నాగార్జునతో లింక్ అయ్యి జరిగిందట. ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు నాగార్జున సినిమాలు తన క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి.

nagarjuna skipped this biggest hit in bollywood which made with 4 crore and got 33 crore

కాగా అలా 80స్ 90స్ టైం లో నాగార్జున చేసిన కొన్ని సిన్మాలు బంపర్ హిట్స్ గా నిలిచిపోగా తన కెరీర్ కి బాగా బూస్టప్ ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేసిన సినిమా కోసమే తాను ఇటీవల రివీల్ చేశారు. కాగా రామ్ గోపాల్ వర్మ నాగార్జునకి "శివ" అనే భారీ హిట్ చిత్రాన్ని ఇచ్చిన పిదప బాలీవుడ్ లోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు.

అలా బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ కూడా క్రేజీ హిట్ సినిమాలు చేసాడు. అలా హిందీలో చేసి హిట్ కొట్టినా సినిమా ఒకటి నాగార్జునతో మొదటిగా రామ్ గోపాల్ వర్మ అనుకున్నాడట. మరి ఆ సినిమానే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "రంగీలా" అట. మరి ఈ చిత్రాన్ని అసలు మొట్ట మొదటిగా నాగార్జుననే హీరోగా అనుకోని వర్మ ప్లాన్ చేసుకోగా తనకి సరసన తన అభిమాన నటి శ్రీదేవిని పెట్టి తీయాలి అనుకున్నాడట.

కానీ ఈ సినిమా పలు కారణాలు చేత బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నాగ్ ప్లేస్ లో హీరోగా చేసాడు. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే 4 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కించగా అది ఏకంగా 33 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని భారీ లాభాలు అందించింది. మరి ఈ సినిమా కానీ నాగార్జునకి పడి ఉంటే అప్పట్లో నాగ్ చార్మ్ కి క్రేజ్ కి పెద్ద హిట్ అయ్యి ఉండేది అని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేసాడు.

nagarjuna skipped this biggest hit in bollywood which made with 4 crore and got 33 crore

ఇక ఈ సినిమా కాకుండా ఆ సమయంలోనే నాగార్జునతో "గోవింద గోవింద" అనే సినిమాని వర్మ చేసిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత వారి కాంబినేషన్ నుంచి వచ్చిన "ఆఫీసర్" అనే సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు అయితే మళ్ళీ వర్మ తన కాంట్రోవర్సియల్ సినిమాలకి చెక్ చెప్పి నార్మల్ సినిమాలు తీసుకుంటా అని సెలవిచ్చాడు.

ఇక నాగార్జున అయితే హీరోగానే కాకుండా సహాయ నటుడుగా కూడా పలు సినిమాలు తెలుగు సహా హిందీ, తమిళ్ కూడా నటించేస్తున్నారు. బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అనే భారీ సినిమాలో కనిపించిన నాగ్ ఇప్పుడు తమిళ హీరో ధనుష్ తో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల చేస్తున్న చిత్రం "కుబేర" లో కూడా సాలిడ్ పాత్రని తాను చేస్తున్నారు. ఇలా నాగ్ అయితే టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: nagarjuna kubera brahmastra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X