twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ కి తాజా షాక్.. రాపిడో వ్యవహరంలో కోర్టు కీలక ఆదేశాలు!

    |

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాలు చేస్తూనే మరో పక్క అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అనేక యాడ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన చేసిన ఒక యాడ్ ఆయనని చిక్కుల్లో పడేలా చేసింది. అల్లు అర్జున్ ఆ వివాదంలో చిక్కుకోవడమే కాకుండా నోటీసులు కూడా అందుకున్నారు. ఇప్పుడు కోర్టు కూడా ఆ యాడ్ విషయంలో షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

    పాన్ ఇండియా లెవెల్ లో

    పాన్ ఇండియా లెవెల్ లో

    చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠ పురంలో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతానికి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా ఒక డీ గ్లామర్ రోల్ లో నటించడమే కాక పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కావాల్సి ఉన్నా అది వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

    మసాలా దోశ అంటూ

    మసాలా దోశ అంటూ

    అయితే కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్టను కించపరచినందుకు గాను అల్లు అర్జున్ సహా రాపిడో అనే ఒక బైక్ షేరింగ్ సంస్థ కు లీగల్ నోటీసు ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అల్లు అర్జున్ నటించిన తాజా రాపిడో యాడ్లో ఆర్టీసీ బస్సులను కించపరిచే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని, ఆర్టీసీ బస్సులో ఎక్కితే సాధారణ దోశల మాదిరి గానే ఎక్కువ సమయం తీసుకుంటాయి అని కానీ రాపిడో చాలా వేగంగా సురక్షితంగా ఉంటుందని అదే సమయంలో మసాలా దోశ సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ చెప్పడం సరికాదని పేర్కొన్నారు.

     సజ్జనార్ విమర్శలు

    సజ్జనార్ విమర్శలు

    ఈ యాడ్ తో ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సహా అనేకమంది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అని పేర్కొన్న ఆర్టీసీ ఎండి సజ్జనార్ రాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను నెగిటివ్గా చూపించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

    రాపిడోకు షాక్‌

    రాపిడోకు షాక్‌

    తాజాగా ఇదే విషయం మీద తెలంగాణ నాంపల్లి కోర్టులో ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ రాపిడోకు షాక్‌ ఎదురైంది. ఆర్టీసీ పరువు నష్టం కలిగించే ప్రకటన ఫోటోలను ప్రసారం చేయడం నిలిపివేయాలంటూ రాపిడోను ఆదేశించింది నాంపల్లి కోర్టు. యూట్యూబ్‌‌లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలు తీసివేయాలని కోర్టు ఆదేశించింది.

    Recommended Video

    Latest Tollywood Updates : Allu Arjun ఖాతాలో ఓ అరుదైన రికార్డు..! || Filmibeat Telugu
    ఉత్తర్వులు జారీ

    ఉత్తర్వులు జారీ

    ఇక కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారు అంటూ కోర్టు స్పష్టం చేసింది. నాంపల్లి కోర్టు ఈ కేసును విచారించింది మరియు TSRTC పరువు తీస్తున్న వాణిజ్య ప్రకటనలు తొలగించాలని ఆదేశించింది. అయితే అల్లు అర్జున్ నటించిన కమర్షియల్ యాడ్ వివాదాస్పదంగా మారడం ఇదే తొలిసారి. అయితే ఆర్టీసీ చేసిన వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ప్రకటనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    English summary
    Nampally court Orders Take Down Of Allu Arjun’s advertisement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X