Mahesh Babu న్యూ లుక్ వైరల్.. త్రివిక్రమ్ సినిమా కోసేమనా..?
టాలీవుడ్ సూపర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదు పదుల వయసులోకి వస్తున్న కూడా ఇంకా రెండు పదుల కుర్రోడి తరహాలోనే కనిపిస్తూ ఉంటాడు. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఊహించిన విధంగా మహేష్ బాబు తన లుక్కుతో ఎప్పటికప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఇక మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలను రెగ్యులర్ గా ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ షేర్ చేసుకుంటూ ఉంటారు.
రీసెంట్ గా తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె పోస్ట్ చేసిన మహేష్ బాబు ఫోటో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. అందులో మహేష్ బాబు ఫోన్లో మాట్లాడుతూ తన కూతురు ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఈ ఫోటో స్విట్జార్లాండ్ లోనిది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ దేశానికి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫొటోలో మహేష్ లుక్ చూస్తూ ఉంటే నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా కోసమే అనే టాక్ కూడా వస్తోంది.

గతంలోనే దుబాయ్ అమెరికా వెళ్ళిన మహేష్ బాబు ఇప్పుడు ప్రత్యేకంగా స్విట్జార్లాండ్ కు వెళ్లే అక్కడే కొన్ని రోజులపాటు కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేయనున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. మహేష్ బాబు 28వ ప్రాజెక్టుగా సెట్స్ పైకి రానున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇదే నెలలో మొదలు కాబోతోంది.
ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అలాగే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను కూడా ఇదే ఏడాదిలో మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం రాజమౌళి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనులలో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా త్రివిక్రమ్ కూడా గ్యాప్ లేకుండా మహేష్ బాబుతో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. దీంతో రాజమౌళి ప్రాజెక్టు షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది మొదలుకానుంది.


Click it and Unblock the Notifications











