For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahesh Babu: షర్ట్ లేకుండా మహేశ్ బాబు.. షాకింగ్ పిక్స్ వదిలిన నమ్రత

  |

  లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చిన్న వయసులోనే యాక్టింగ్, ఫైట్స్, స్టైల్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో అలరిస్తూ స్టార్‌గా ఎదిగిపోయాడు మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు.

  ఈ జోష్‌లోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో మరింత ఫామ్‌తో కనిపిస్తోన్న మహేశ్.. ఇప్పుడు మరిన్ని చిత్రాలను కమిట్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు షర్ట్ లేకుండా స్మిమ్మింగ్ చేస్తోన్న ఫొటోలను నమ్రత శిరోద్కర్ షేర్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరు కూడా చూసేయండి!

  హ్యాట్రిక్ హిట్లతో మహేశ్ దూకుడు

  హ్యాట్రిక్ హిట్లతో మహేశ్ దూకుడు

  ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు కొరటాల శివ దర్శకత్వంలో నటించిన 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకోవడమే. ఇలా హ్యాట్రిక్‌ను కూడా అందుకున్న ఈ స్టార్ హీరో.. అలాగే ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు.

  హాట్ షోలో హద్దు దాటిన బిగ్ బాస్ లహరి: స్లీవ్‌లెస్ టాప్‌లో అందాల ఆరబోత

  సర్కారు వారి పాట.. టార్గెట్ ఇలా

  సర్కారు వారి పాట.. టార్గెట్ ఇలా


  సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేశాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. దీనికి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఓపెనింగ్ బాగానే ఉన్నా టార్గెట్‌ను రీచ్ అవలేదు.

  త్రివిక్రమ్‌తో మహేశ్ మూడోసారి

  త్రివిక్రమ్‌తో మహేశ్ మూడోసారి


  వరుసగా విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు.. త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

  షార్ట్ డ్రెస్‌లో హాట్‌గా అనుష్క శర్మ: కోహ్లీ భార్య ఫోజులు చూశారంటే!

  రాజమౌళితోనూ సినిమా ప్రకటన

  రాజమౌళితోనూ సినిమా ప్రకటన


  సూపర్ స్టార్ మహేశ్ బాబు త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళితో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా అడ్వెంచర్ జోనర్‌లో రాబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు స్క్రిప్టు వర్కును కూడా విజయేంద్రప్రసాద్ ప్రారంభించారు. వచ్చే ఏడాది ద్వితియార్థంలో ఇది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

  ఫ్యామిలీతో జాలీగా సూపర్ స్టార్

  ఫ్యామిలీతో జాలీగా సూపర్ స్టార్


  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే అతడు తరచూ కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకు వెళ్తూ ఉంటాడు. అలాగే, ఇంట్లో కూడా ఎక్కువగా భార్య, పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.

  శృతి మించిన రాశీ ఖన్నా అందాల ఆరబోత: అసలు ఆమె టాప్ చూశారంటే!

  షర్ట్ లేకుండా కనిపించిన హీరో

  షర్ట్ లేకుండా కనిపించిన హీరో

  హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో భాగంగానే ఆమె తరచూ సూపర్ స్టార్ ఫొటోలను.. తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ బాబు స్విమ్మింగ్ పూల్‌లో షర్ట్ లేకుండా ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
  కొన్ని శనివారాలు ఇలాగేనంటూ

  కొన్ని శనివారాలు ఇలాగేనంటూ


  షర్ట్ లేకుండా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న మహేశ్ బాబు ఫొటోలను నమ్రత షేర్ చేశారు. దీనికి 'కొన్ని శనివారం ఉదయాలు ఇలాగే ఉంటాయి' అనే క్యాప్షన్ పెట్టారు. ఇక, ఈ పిక్స్‌లో ఈ స్టార్ హీరో అదిరిపోయే బాడీతో కనిపిస్తున్నాడు. ఇంకేముంది.. వీటిని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.

  English summary
  Mahesh Babu Committed Several films with star directors. Now his wife Namrata Shirodkar Shares Mahesh Babu Shirtless Pics.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X