శ్రీకాకుళం తుఫాన్ బాధితులకు బాలకృష్ణ అండ.. 25 లక్షల విరాళం
తిత్లీ తుఫాన్‌తో తల్లడిల్లుతున్న శ్రీకాకుళం జిల్లా వాసులకు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన తుఫాన్ బాధితులకు బాలయ్య ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
కష్టకాలంలో అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి బాలకృష్ణ 25 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. బాధితులను ఆదుకోవాలని అభిమానులకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

తుఫాన్ బాధితులకు సహాయం అందించడానికి సంపూర్ణేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం, కార్తీకేయ, నిఖిల్ తదితరులు తమ వంతు సహాయాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











