బాలయ్య రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్.. ఆ సినిమాలు చేసుంటే రేంజ్ మరోలా..

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ.. పాత్ర ఏదైనా.. కథ ఇలాంటిదైనా అందులో ఒదిగిపోయే గొప్ప నటుడు బాలకృష్ణ. ఆయన పోషించే ఏ పాత్రకైనా నూటికి నూరు శాతం న్యాయం చేసే అతికొద్ది మంది నటులలో బాలయ్య ఒకడు. నందమూరి తారక రామారావు నట వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ వరుస బ్లాక్ బ్లాసర్ హిట్స్ అందుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేటీకి కూడా టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.

తన 50 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో ఎనర్జిటిక్ సినిమాలలో నటించి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఈ సంక్రాంతికి 'డాకు మహారాజు' ప్రేక్షకులు ముందుకి వస్తున్నారు. అయితే నందమూరి నటసింహం తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేశాడు. ఆ సినిమాలు చేసి ఉంటే బాలకృష్ణ రేంజ్ మరోలా ఉండేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఓ లుక్కెయ్యండి.

Nandamuri Bala krishna rejected movies Here is full details list

నందమూరి బాలకృష్ణ తన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లలో నటించి మెప్పించారు. తొలుత 'తాతమ్మ కల' అనే సినిమాతో బాలయ్య సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. ఆ సినిమాలో బాలయ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అనంతరం హీరోగా మారి తండ్రికి తగ్గ వారసుడిగా మెప్పించాడు. బాలయ్య తన నటనతో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మెయిన్ గా బాలయ్య డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్ రావాల్సిందే. ఆయన కంటి చూపుతో చంపేస్తానన్న.. ఒంటి చేత్తో వందమందిని నరికేసినా.. తొడ కొడితే సుమోలు గాలిలోకి ఎగిరిన.. ప్రేక్షకులు అంగీకరిస్తారు. అవి బాలయ్య రేంజ్. అయితే.. బాలయ్య తన సినీ కెరీర్ లో కొన్ని అనివార్య కారణాలవల్ల కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ సినిమాలు ఏంటో చూద్దాం..

జానకి రాముడు

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ జానకిరాముడు. నాగార్జున-విజయశాంతి హీరోహీరోయిన్ గా నటించారు. ఈ జంటగా నటించారు. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లోని లవ్ స్టోరీ గా తెరకెక్కిన జానకి రాముడు సినిమా నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ గా మారింది. అయితే .. ఈ సినిమాలో బాలకృష్ణ నటించాల్సింది. అలాగే ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలవల్ల కోడి రామకృష్ణ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. దీంతో బాలకృష్ణ కూడా ఈ ప్రాజెక్టు నుండి వైదొలిగారు. దీంతో ఈ సినిమా ఆఫర్ రాఘవేంద్రరావు, నాగార్జున్ లకు వచ్చేసింది.

చంటి

విక్టరీ వెంకటేష్ కెరియర్లో మైల్ స్టోన్ మూవీగా చెప్పుకునే సినిమాలలో చంటి సినిమా ఒకటి. వాస్తవానికి ఈ సినిమాను మొదట బాలకృష్ణతో చేయించాలని పరుచూరి బ్రదర్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఈ స్టోరీ బాలకృష్ణ కు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత రాజశేఖర్ తో రూపొందించాలని ప్రయత్నించారు కానీ ఆ కాంబినేషన్ కూడా సెట్ కాలేదు. దీంతో ఫైనల్ గా వెంకీ తో సెట్ అయింది. ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సింహరాశి

రాజశేఖర్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ సింహరాశి. ఈ సినిమాను దర్శకత్వం వహించిన సముద్ర.. బాలకృష్ణతో ఈ ప్రాజెక్టు చేయాలని భావించారు. కానీ, బాలయ్య మరో సినిమాలో బిజీగా ఉండడంతో ఈ సినిమా ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో రాజశేఖర్ ఈ సినిమా చేసే అవకాశాన్ని అందుకొని తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేశాడు.

సూర్యవంశం

విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ మూవీ సూర్యవంశం. ఈ సినిమా కథ తొలుత బాలకృష్ణ దగ్గరికి వెళ్లిందట. కానీ 'పెద్దన్నయ్య' కథని పోలి ఉండడంతో బాలకృష్ణ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దీంతో మూవీ మేకర్స్ ఈ కథను విక్టరీ వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్లడంతో .. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

శివరామరాజు

నందమూరి హరికృష్ణ సినీ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలలో శివరామరాజు ఒకటి. ఆయన నటించిన కొన్ని సినిమాలలో శివరామరాజు ఎవర్ గ్రీన్ మూవీ. అయితే.. హరికృష్ణ కంటే ముందు ఈ కథ బాలయ్య దగ్గరికి వెళ్లిందట. కానీ, ఆ కథ బాలకృష్ణకు అంటగా నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. దీంతో మూవీ మేకర్స్ హరికృష్ణను ఫైనల్ చేశారు.‌

అన్నవరం

పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమా కథ తొలుత బాలకృష్ణ దగ్గరికి వెళ్లిందట. రాయలసీమ బ్యాగ్రౌండ్ ఉండడంతో ఈ సినిమాను కచ్చితంగా ఓకే చేస్తారని పరుచూరి బ్రదర్స్ అనుకున్నారట. కానీ, బాలకృష్ణకు ఆ కథ అంతగా నచ్చకపోవడంతో లైట్ గా తీసుకున్నారట. దీంతో సూపర్ గుడ్ ఫిలిమ్స్ చిరంజీవిని కూడా సంప్రదించారట. కానీ, చిరు ఆసక్తి చూపించకపోవడంతో.. ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేశారు. ఈ మూవీ అనుకొనంత స్థాయిలో ఆడ లేకపోయినా యావరేజ్ టాక్ అందుకుంది.

బాడీగార్డ్

మొదట ఈ రీమేక్ మూవీ కూడా బాలయ్య బాబు దగ్గరికి వెళ్లిందట. అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ రీమిక్ హక్కులను నిర్మాత బెల్లంకొండ సురేష్ కొనుగోలు చేయడంతో..‌ బాలకృష్ణ ఆ ప్రాజెక్టు నుండి తప్పించుకున్నారట. దీంతో మూవీ మేకర్స్ విక్టరీ వెంకటేష్ ను సంప్రదించారు. ఆ కథ వెంకీకి నచ్చడంతో ఫైనల్ చేశారు.

సైరా

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మూవీ కథ ముందుగా బాలకృష్ణ దగ్గరికి వెళ్లిందట. బాలకృష్ణ ఈ కథ వినడంలో ఆసక్తి చూపించకపోవడంతో మూవీ మేకర్స్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్లారట. ఆ కథలో కొన్ని మార్పులు చేసి మెగాస్టార్ చిరంజీవి నటించారు. ఈ మూవీ ఇలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

క్రాక్

మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్ . ఈ సినిమా కథను గోపీచంద్ మలినేని తొలుత బాలకృష్ణతో చెప్పారంట. కానీ, బాలకృష్ణకు ఆ కథ అంతగా నచ్చకపోవడంతో ఆ క్రేజీ ప్రాజెక్టు ను రిజెక్ట్ చేశారంట. దీంతో మూవీ మేకర్స్ రవితేజను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేశారు. ఈ మూవీ రవితేజ కెరీర్లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది..

సింహాద్రి

ఎన్టీఆర్ కి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ సింహాద్రితో దక్కింది. రాజమౌళి తన రెండో సినిమా కథను బాలకృష్ణకు వినిపించారు. కానీ ఆయన ఆసక్తి చూపలేదు. రాజమౌళికి అప్పుడు ఇంతటి ఫేమ్ లేదు. ఈ కారణంగా బాలకృష్ణ సింహాద్రి ప్రాజెక్ట్ రద్దు చేయలేదు. దీంతో ఆ కథను జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించారు. ఈ మూవీ ఎన్టీఆర్ ని మాస్ హీరోల జాబితాలో చేర్చిందన్నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ విధంగా సింహాద్రి రూపంలో మరో సూపర్ హిట్ బాలయ్యకు మిస్ అయ్యింది.

More from Filmibeat

Read more about: balakrishna daaku maharaaj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X