Mokshagnya New Look: యాక్షన్‌ హీరో.. బాలకృష్ణ తనయుడి న్యూ లుక్ అదుర్స్..

నటసింనందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమాకు రంగం సిద్దమైన విషయం తెలిసిందే. యంగ్ అండ్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి హీరో మోక్షజ్ఞ తొలి సినిమా రాబోతుంది. ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తూ సినిమాపై హైప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. తాజాగా నందమూరి యంగ్ హీరో మోక్షజ్ఞ లూక్ కు సంబంధించిన ఓ కీలక అప్డేట్ ఇచ్చారు.

నందమూరి తారక రామారావు మనవడు, నటసింహం నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం కోట్లాది మంది జనాలు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన విషయం తెలిసిందే. మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. బ్లాక్ బస్టర్ చిత్రం హనుమాన్‌కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ చేతుల్లో మోక్షజ్ఞ మొదటి సినిమా బాధ్యతలు పెట్టారు బాలయ్య. సుధాకర్ చెరుకూర తన ఎస్వీఎల్ మూవీపై లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Nandamuri Bala Krishna son Mokshagna New look photos shared by Prasanth Varma on Twitter goes viral

ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో వస్తున్న మూవీని సినీమాటికీ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న సినిమా ('సింబా ఈజ్ కమింగ్') కావడం విశేషం. ఇప్పటికే నందమూరి వారసుడు మోక్షజ్ఞ నటనలో మెళకువలు నేర్చుకున్నారు. అలాగే.. ఫైట్లు, డాన్సులలో శిక్షణ తీసుకున్నాడు. తన డెబ్యూ మూవీ కోసం సరికొత్త మేకోవర్ తో ఆకట్టుకోబోతున్నాడు మోక్షజ్ఞ. ఈ భారీ బడ్జెట్ మూవీని మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ప్రకటించగా, ఆ సమయంలో రిలీజ్ చేసిన పోస్టర్ తెగ వైరల్ అయ్యింది. ఇక తాజాగా మూవీ మేకర్స్ మోక్షజ్ఞ నయా లుక్ ఫోటోను సోషల్ మీడియాను షేర్ చేశారు.

తాజాగా మోక్షజ్ఞ తొలి మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ .. మోక్షజ్ఞ మోడ్రన్, స్టైలిష్ లుక్స్ ను రిలీజ్ చేశాడు. ఆ పిక్ లో మోక్షజ్ఞ చాలా కాన్ఫిడెంట్ గా.. యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. మోక్షజ్ఞ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇలాంటి హ్యాండ్సమ్ లుక్ ను మెయింటైన్ చేస్తే మోక్షజ్ఞ కు ఫీమేల్ ఫ్యాన్ బేస్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది. ఇక ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ కాంబోలో సినిమా రాబోతోంది అని తెలిసినప్పటి నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ లేటెస్ట్ లూక్స్ తో మోక్షజ్ఞ తొలి సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Nandamuri Bala Krishna son Mokshagna New look photos shared by Prasanth Varma on Twitter goes viral

ఇకపోతే మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషికం తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం నందమూరి హీరో మోక్షజ్ఞ ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని టాక్. ఈ వార్త విన్న నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇది షాకింగ్ రెమ్యూనేషనే అని చెప్పాలి. ఎన్నో ఆశలతో వస్తున్న మోక్షజ్ఞ ఫ్యాన్స్ తన తొలి సినిమాతో మెప్పిస్తారో లేదో.. వేచి చూడాలి. అలాగే..బాలయ్య నట వారసత్వాన్ని కొనసాగుతారో లేదో వేచి చూడాలి మరీ.

More from Filmibeat

Read more about: mokshagna teja balakrishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X