నందమూరి ఫ్యాన్స్‌కు శుభవార్త.. బాలయ్య సినిమా అప్డేట్ వచ్చేస్తోంది
నందమూరి బాలకృష్ణ.. డైలాగ్‌లు వినక అభిమానులకు చాలా గ్యాప్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలతో అభిమానుల ఆకలి తీరలేదు. అందుకే వారి కోరిక మేరకు కత్తి పట్టి శత్రు సంహారం చేస్తున్నాడు.
దసరా కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో నందమూరి అభిమానులు కోరుకునే ప్రతీ అంశం ఉండబోతోందని తెలుస్తోంది. పక్కా మాస్ మసాలా అంశాలతో రూపు దిద్దుకుంటోన్న ఈ మూవీ నుంచి ఓ అప్డేట్‌ను చిత్రయూనిట్ ప్రకటించేసింది.

ఈ చిత్రానికి బాలయ్య గెటప్, లుక్ ప్లస్ అవుతుందని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే బాలయ్య లుక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయింది. దసరాకు పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన యూనిట్.. దీపావళికి మరో కానుకను ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మూవీకి సంబంధించి రేపు ఓ అప్డేట్‌ను ప్రకటించనున్నట్లు యూనిట్ పేర్కొంది. ఏంటా అప్డేట్ అని నందమూరి ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు. భూమిక, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తోన్న ఈ మూవీకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని సీ. కళ్యాణ్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











