NBK 108: అనిల్ రావిపూడి మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్.. బాలయ్య అంతకంటే డబుల్!

నందమూరి బాలకృష్ణ రేంజ్ ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. అఖండ సినిమా తర్వాత ఆయన బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. అంతేకాకుండా అన్ స్టాపబుల్ షో ద్వారా కూడా బాలయ్య రేంజ్ మరింత పెరిగింది. ఇక ఇటీవల వచ్చిన వీర నరసింహారెడ్డి సినిమా కూడా మరో లెవల్ కు తీసుకువెళ్ళింది. అయితే నందమూరి బాలకృష్ణ 108వ సినిమాకు సంబంధించిన పారితోషికాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. డైరెక్టర్ కంటే బాలయ్య బాబు అంతకంటే డబుల్ పేమెంట్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వీరసింహారెడ్డితో బిగ్ హిట్

వీరసింహారెడ్డితో బిగ్ హిట్

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని నిర్మాతకు మంచి ప్రాఫిట్ అయితే అందించింది.

బాలయ్య 108 వ సినిమా

బాలయ్య 108 వ సినిమా

నందమూరి బాలకృష్ణ తో సినిమా చేస్తే మినిమం సక్సెస్ అనే విధంగా సినిమా ఉంటుంది అని ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ అయితే క్రియేట్ అయింది. అయితే ఆయనతో సినిమాలు చేసేందుకు కూడా నిర్మాతలు చాలావరకు పోటీ పడుతున్నారు. ఇక ముందుగా ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం బాలయ్య బాబు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. 108వ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్లో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు శ్రీనివాస చిట్టూరి నిర్మాత.

అనిల్ కామెడీ.. బాలయ్య మాస్ స్టైల్

అనిల్ కామెడీ.. బాలయ్య మాస్ స్టైల్

ఇక అనిల్ రావిపూడి ఎప్పటినుంచో బాలయ్య బాబుతో సినిమా చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి బాలయ్య బాబు 108వ సినిమాకు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఆయన స్టైల్ కు తగ్గట్టుగా మంచి యాక్షన్ మోడ్ లో ఉండడమే కాకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి టైమింగ్ తగ్గ కామెడీ కూడా ఇందులో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంత?

డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంత?

అయితే ఈ సినిమా పారితోషికాల విషయంలో కూడా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఊహించని స్థాయిలో 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రాఫిట్ లో షేర్ అందుకునే విధంగా ముందుగా ఒప్పందం చేసుకోవాలని అనుకున్నారట. కానీ దర్శకుడు మాత్రం ఆ రిస్క్ చేయడానికి ఇంతవరకు ఏ నిర్మాతకు ఒప్పుకోలేదు. అందుకే డైరెక్ట్ గా తన రెమ్యునరేషన్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

బాలయ్య షాకింగ్ రెమ్యునరేషన్

బాలయ్య షాకింగ్ రెమ్యునరేషన్

ఇక నందమూరి బాలకృష్ణ దర్శకుడి కంటే ఎక్కువ స్థాయిలోనే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో నందమూరి బాలయ్యకు మంచి డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే NBK 108వ సినిమాకు దర్శకుడు 10 కోట్లు తీసుకుంటూ ఉండగా బాలయ్య బాబు మాత్రం 20 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నిర్మాత కూడా వారి ఇష్టప్రకారమే పారితోషికాలు ఇస్తున్నట్లు సమాచారం. మరి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ కాంబినేషన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X