NBK 108: బాలయ్య నెవర్ బిఫోర్ రోల్.. రావిపూడి హై వోల్టేజ్ అప్డేట్!
నందమూరి బాలకృష్ణ తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసే వెంటనే మరొక ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాలి అని చూస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి మొత్తానికి తన ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి అప్డేట్ కూడా ఇచ్చేశాడు.
ఎప్పటినుంచో దీని కోసమే అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మధ్యలో స్క్రిప్ట్ కారణాల వలన కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని కూడా కథనాలు అయితే వెలువడ్డాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది అని అఫీషియల్ గా అనిల్ రావిపూడి క్లారిటీ అయితే ఇచ్చేసాడు. ఇక ఈ ప్రాజెక్టుకు థమన్ సంగీతం అందించబోతున్నాడు.

తమన్ బాలకృష్ణ కాంబినేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాకు అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినా థమన్ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న 107వ సినిమాకు కూడా అదే తరహాలో మ్యూజిక్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా మూడోసారి బాలయ్య 108 va సినిమాకు మ్యూజిక్ అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
అనిల్ రావిపూడి కి ఇది థమన్ కలయికలో ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ అప్డేట్ లో ఒక మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక దానికి థమన్ నిచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే బాలయ్యను నెవర్ బిఫోర్ అనే పాత్రలో కూడా చూపించబోతున్నట్లుగా అనిల్ రావిపూడి పేర్కొన్నాడు. మరి ఈ ప్రాజెక్టు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











