NBK110 గుర్రమెక్కి వీరనాయకుడిగా బాలకృష్ణ.. Battle Of Breaths లుక్‌తో అదరగొట్టిన నటసింహం!

నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల కాలంలో పులో జోష్ మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆయన తన తోటి హీరోలకే కాదు.. కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీనిస్తూ.. సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వరుస హ్యాట్రిక్ హిట్లతో జోష్ మీద ఉన్న ఆయన.. తదుపరి చిత్రాన్ని బాబీతో చేస్తున్నారు. ఇక ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ఎన్బీకే 109గా తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. ఆయన నటిస్తున్న ఎన్బీకే110 నుంచి ఓ స్నీక్ పీక్ వీడియో రిలీజ్ అయి.. విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆరు పదుల వయసులోనూ.. వరుస హిట్లతో దూసుకుపోతున్నారు బాలయ్య. అఖండ నుంచి మొదలైన ఆయన విజయం.. మొన్నటి భగవంత్ కేసరి వరకు కొనసాగింది. ఇక ఇదే జోష్ లోనే వరుస సినిమాలు చేసేందుకు మరింత జోష్ తో ముందుకు వస్తున్నారు నందమూరి నటసింహం. అఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి.. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. హ్యాట్రిక్ హీరోగా మారిపోయారు బాలయ్య.

Nandamuri Balakrishna 110 Movie Battle of Breaths Exclusive Sneak Peak Video Viral

ఇప్పుడు ఈ హీరో వరుసగా చిత్రాలను లైన్ లో పెట్టారు. ఇప్పటికే బాబీ బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన మూవీ పట్టాలెక్కింది. ఇటీవల ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఆ పోస్టర్ లో గొడ్డలిపై కళ్లజోడు పెట్టి.. ఒక లాకెట్ పెట్టి.. ఫుల్ హైప్ ను ఇచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమా కూడా యాక్షన్ సీక్వెన్స్ తోనే రాబోతుందని తెలుస్తోంది. మరోసారి బాలయ్యను యాక్షన్ మోడ్ లో చూడబోతున్నట్లు అర్థం అవుతుంది.

బాబీ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. ఇక ఆయన నెక్ట్స్ మూవీస్ కూడా లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తుంది. ఎన్బీకే 110 మూవీ నుంచి ఆ మధ్య పోస్టర్ రిలీజ్ అయినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ లో బాలయ్య యుద్ధ భూమిలో వీరుడిగా కనిపించారు. ఇక దానికి బాటిల్ ఆఫ్ బ్రీత్స్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Nandamuri Balakrishna 110 Movie Battle of Breaths Exclusive Sneak Peak Video Viral

బ్యాటిల్ ఆఫ్ బ్రీత్స్ పేరిట బాలయ్య వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో బాలయ్య గుర్రం ఎక్కిన సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక బాలయ్య గుర్రమెక్కి వీరనాయకుడిగా కనిపించాడు. ఈ లుక్ చూస్తే.. బాలయ్య ఫ్యాన్స్ కే కాదు.. మామూలు సినీ ప్రేక్షకులకు సైతం గూస్ బంప్స్ పక్కా. ఇప్పుడు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అయితే సంబరంలో మునిగిపోయారు. అసలు ఇది దేని గురించి అనేది మాత్రం ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు.

బాలయ్య 110 మూవీ సుకుమార్ దర్శకత్వంలో రానున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. మరి ఈ స్నీక్ పీక్ వీడియో ఆ సినిమాకు సంబంధించిందా.. లేదా కొత్త సినిమానా అనేది తెలియదు. లేదా ఏదైనా ప్రోగ్రామ్ కు సంబంధించినదా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ వీడియోలో బాలయ్యను యుద్ధవీరుడుగా చూసి.. ఫ్యాన్స్ ఎక్సైట్ ఫీల్ అవుతున్నారు. ఈ లుక్ తో ఓ సినిమా తీస్తే బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X