మీకు పెరుగుతోందేమో, నాకు తగ్గుతోంది... బర్త్ డే విషెస్ చెప్పిన వారికి బాలయ్య కౌంటర్!

Recommended Video

Nandamuri Balakrishna Interesting Comments On His Birthday || Filmibeat Telugu

నందమూరి నటసింహం బాలకృష్ణ నేడు (జూన్ 10) 59వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ... ''అందరూ నాకు ఫోన్లు చేసి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. వారికి ఒకటే చెప్పాను. ఏమయ్యా... మీకు వయసు పెరుగుతుందేమోకానీ, నాకు వయసు తగ్గుతోంది అన్నాను. ఆ రకంగా విష్ చేయమని చెప్పాను'' అంటూ చమత్కరించారు.

నాన్నగారిని చూసి చాలా విషయాల్లో స్పూర్తి పొందాను

నాన్నగారిని చూసి చాలా విషయాల్లో స్పూర్తి పొందాను

ఎవరైతే తాము పుట్టిన కుటుంబానికి, ఊరికి, జాతికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారో... వారు భౌతికంగా లేక పోయినా అందరి మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండి పోతారు. నేను మా నాన్నగారిని చూసి చాలా విషయాల్లో స్పూర్తి పొందాను. జీవన విధానం, సమాజానికి చేయడం లాంటి అంశాల్లో ఆయన పద్దతులను అనుసరిస్తున్నాను. అటువంటి పుణ్యదంపతుల బిడ్డగా పుట్టినందుకు వారికి సదా రుణపడి ఉంటాను... అని బాలయ్య వ్యాఖ్యానించారు.

మీ అందరి సహకారం వల్లే ఈ సేవ సాధ్యమైంది

మీ అందరి సహకారం వల్లే ఈ సేవ సాధ్యమైంది

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవ చేసే అవకాశం దక్కింనందుకు ఆనందంగా ఉంది. అది నా పూర్వ జన్మ సుకృతం. మీ అందరి సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమైంది, ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు బాలయ్య తెలిపారు.

మందు, సిగరెట్టు కూడా కారణం

మందు, సిగరెట్టు కూడా కారణం

నాకు షుగర్ బోర్డర్ లైన్లో ఉంది, అందకే కేకు బయాప్సీ చేయాలని, తిన్న తర్వాత నన్ను బయాప్సీ చేయాలని చెప్పాను. క్యాన్సర్ విషయానికొస్తే... అనేది రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా కారణం. నిలువ ఉంచిన తిండి పదార్థాలు, జంక్ ఫుడ్, సిగరెట్లు, మందు ఇవన్నీ కూడా కారణమే. ఇలాంటి వాటిపై ఇంకా రీసెర్చ్ జరుగుతోందని బాలయ్య చెప్పుకొచ్చారు.

అసలైన సెలబ్రేషన్ డే అప్పుడే

అసలైన సెలబ్రేషన్ డే అప్పుడే

ఈ రోజు నా పుట్టినరోజు అయినప్పటికీ మనకు అసలైన సెలబ్రేషన్ డే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఫౌండర్స్ డే రోజే. మన ఆసుపత్రి దేశంలోనే నెం.1 స్థానంలో ఉంది. ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరడానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X