Balakrishna: కోట్ల రెమ్యూనరేషన్ ఆసుపత్రికి విరాళం.. దట్ ఇజ్ బాలయ్య!
నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు యాడ్స్ చేసేందుకు ఎందుకో ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన వరుసగా అడ్వర్టైజ్మెంట్ లు చేయడం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం చేస్తూ సినిమాలతో పాటు మరింత ఆదాయం కూడా పొందుతున్నారు. అయితే ఆయన ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఎన్ని కోట్లు తీసుకుంటారనే విషయం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం.
నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ ముందుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో టాప్ ఫోర్ హీరోలలో ఒకరిగా నిలిచిన ఆయన నందమూరి అభిమానులందరినీ అలరిస్తూ వస్తూ ఉంటాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉండడంతో ఎక్కువగా అలాంటి సినిమాలే చేస్తూ వచ్చేవాడు బాలకృష్ణ. ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గకుండా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ప్రస్తుతానికి ఆయన హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు.

అయితే మునుపు ఎప్పుడూ అడ్వర్టైజ్మెంట్స్ చేయడానికి ఆసక్తి చూపించని బాలకృష్ణ కొన్ని నెలల క్రితం వేగా జువెలర్స్ అంటూ ఒక జువెలరీ బ్రాండ్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే కాదు. దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించాడు. దీంతో ఆ ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో జువెలరీ బ్రాండ్ కూడా సేల్స్ గట్టిగానే వస్తున్నాయట. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో యాడ్లో నటించేందుకు డీల్ ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది.
నిజానికి పటాన్ చెరువు దగ్గరలో ఒక భారీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది. అది కూడా నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగానే జరిగింది. ఆ షాపింగ్ మాల్ యాడ్ కి సంబంధించి కూడా నందమూరి బాలకృష్ణ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ షాపింగ్ మాల్ యాడ్ కోసం రకరకాల ఫోటోషూట్ లు కూడా చేశారని త్వరలోనే ఆ యాడ్ షూటింగ్ కూడా పూర్తి చేసి టెలివిజన్లోకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
ఇక ఈ యాడ్ చేసేందుకు దాదాపుగా నందమూరి బాలకృష్ణ మూడున్నర కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాను యాడ్స్ చేసే పరిస్థితుల్లో ఆ వచ్చే ఆలయం మొత్తాన్ని బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ కి నందమూరి బాలకృష్ణ తరలించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అన్ ష్టాపబుల్ షో చేస్తున్నారు.
అక్కడి నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ కూడా దాదాపుగా బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ కి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మా బాలయ్య మనసు బంగారం అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం మీద మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications











