twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి రికార్డును బద్దలు కొట్టిన బాలకృష్ణ: తెలుగులో ఏకైక హీరోగా చరిత్ర.. నటసింహా అరాచకమే ఇది

    |

    నందమూరి తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచే జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారాయన. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ అరాచకం సృష్టిస్తోంది. ఫలితంగా టాలీవుడ్‌లో చిరంజీవి పేరిట ఉన్న నెంబర్ వన్ రికార్డు బద్దలైపోయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

    ఇద్దరికీ ఫ్లాపులే.. బాలయ్య 3 బోయపాటి 1

    ఇద్దరికీ ఫ్లాపులే.. బాలయ్య 3 బోయపాటి 1

    'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఆయన ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవడం లేదు. దీనికితోడు 2019లో ఏకంగా మూడు ఫ్లాపులను ఎదుర్కొన్నాడు. ఇక, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా రామ్ చరణ్‌ 'వినయ విధేయ రామ'తో భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు.

    రెండు హిట్ల తర్వాత మరోసారి కలిసిన జోడీ

    రెండు హిట్ల తర్వాత మరోసారి కలిసిన జోడీ

    నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో 'సింహా', 'లెజెండ్' చిత్రాలు ఉంటాయి. ఈ రెండింటినీ బోయపాటి శ్రీను రూపొందించాడు. అలా రెండు భారీ విజయాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లు. శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు.

    తెలుగులో అలా తొలిసారి... బాలకృష్ణ ప్లాన్

    తెలుగులో అలా తొలిసారి... బాలకృష్ణ ప్లాన్

    రెండు భారీ హిట్ల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రీతిలో ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అంతేకాదు, ఇందులో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి అఘోరా పాత్ర కూడా ఉంది. గతంలో తెలుగులో ఏ హీరో కూడా ఇలాంటి పాత్రను పోషించలేదు. దీంతో అంచనాలు పెరిగాయి.

    BB3 టైటిల రోర్.. అదరగొట్టేసిన కొత్త టీజర్

    BB3 టైటిల రోర్.. అదరగొట్టేసిన కొత్త టీజర్

    బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమాకు BB3 అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ క్రమంలోనే మూవీ కోసం 'మోనార్క్', 'సూపర్‌మ్యాన్', 'ధర్మ', 'గాడ్ ఫాదర్' వంటి ఎన్నో టైటిళ్లను పరిశీలించారు. కానీ, చివరకు 'అఖండ' అనే కొత్త పేరును పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఉగాదికి వదిలారు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

    ఒక్క రోజులోనే భారీగా.... రికార్డులు బద్దలు

    ఒక్క రోజులోనే భారీగా.... రికార్డులు బద్దలు

    'అఖండ' టీజర్‌‌లో బాలయ్య అఘోరా లుక్.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. బోయపాటి మార్క్ పవర్ ఫుల్ డైలాగ్ అదిరిపోయాయి. అందుకే దీనికి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 11 మిలియన్ పైచిలుకు వ్యూస్‌ను రాబట్టింది. ఫలితంగా ఒక రోజులోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

    RRR రికార్డును బ్రేక్ చేసిన ‘అఖండ' టీజర్

    RRR రికార్డును బ్రేక్ చేసిన ‘అఖండ' టీజర్

    'అఖండ' టీజర్ ధాటికి ఎన్నో రికార్డులు కనుమరుగైపోయాయి. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన RRR మోషన్ పోస్టర్ వీడియోకు నాలుగు వారాల్లో 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన 'భీమ్ ఫర్ రామరాజు' టీజర్‌కు నెలలో 12 మిలియన్ వ్యూస్ దక్కాయి. అయితే, బాలయ్య 'అఖండ' టీజర్‌కు మాత్రం కేవలం 25 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సొంతమయ్యాయి.

    Recommended Video

    Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
    చిరంజీవి రికార్డును బద్దలు కొట్టిన బాలకృష్ణ

    చిరంజీవి రికార్డును బద్దలు కొట్టిన బాలకృష్ణ

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'ఆచార్య'. ఈ మూవీ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. దీనికి ఇప్పటి వరకూ 19 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే, బాలయ్య 'అఖండ' టీజర్‌కు కేవలం ఐదు రోజుల్లోనే 25 మిలియన్ వ్యూస్ దక్కాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వ్యూస్ రాబట్టిన ఏకైక సీనియర్ హీరోగా నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారు.

    English summary
    Nandamuri Balakrishna’s upcoming project with Boyapati Srinu. Popular referred to as ‘BB3’, the high-octane actioner will be hitting the worldwide theaters on May 28th, 2021, and clashing with Ravi Teja’s Khiladi at the box-office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X