For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలీవుడ్‌లో బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డ్: ‘అఖండ’తో అరుదైన ఘనత.. తొలిసారి ఈ రేంజ్‌లో!

  |

  చాలా ఏళ్లుగా హిట్ అనే మాట వినక ఇబ్బందులు పడుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయినప్పటికీ విజయం మాత్రం వరించడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. తద్వారా బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి అలాంటి ఘనతను అందుకున్నారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  ఈ సారి ‘అఖండ' మారి వస్తున్న సింహా

  ఈ సారి ‘అఖండ' మారి వస్తున్న సింహా

  హిట్ కోసం పరితపిస్తోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

  తొలిసారి అలాంటి ప్రయోగం చేసిన హీరో

  తొలిసారి అలాంటి ప్రయోగం చేసిన హీరో

  ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న ‘అఖండ' మూవీ కోసం నందమూరి బాలకృష్ణ ఎన్నో సాహసాలు చేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా కనిపించబోతున్నారు. తద్వారా ఈ తరహా పాత్రను పోషిస్తోన్న ఏకైక స్టార్ హీరోగా నిలిచారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

  సౌతిండియాలోనే మొట్టమొదటి హీరోగా

  సౌతిండియాలోనే మొట్టమొదటి హీరోగా

  గత ఉగాదికి ‘అఖండ' సినిమాకు సంబంధించిన టైటిల్ రోర్ వీడియో విడుదలైంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, వేగంగా యాభై మిలియన్లు దాటిన టీజర్‌గా టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. సీనియర్ హీరోల జాబితాలో సౌతిండియాలోనే టాప్ ప్లేస్‌లో నిలిచారు.

   టీజర్‌తో పెరిగిన అంచనాలు... బిజినెస్

  టీజర్‌తో పెరిగిన అంచనాలు... బిజినెస్

  వాస్తవానికి ‘అఖండ' సినిమాపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు చాలా మంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అలాగే, శాటిలైట్ డిజిటల్ రైట్స్ కూడా భారీ ధర పలికాయి.

  బాలీవుడ్‌లో బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డ్

  బాలీవుడ్‌లో బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డ్

  ‘అఖండ' మూవీని నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయాలని భావించారు. కానీ, అప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇది వాయిదా పడిపోయింది. ఇక, త్వరలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా బాలయ్య బాలీవుడ్‌లో సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేశాడు.

  ‘అఖండ'తో అరుదైన ఘనత... తొలిసారి

  ‘అఖండ'తో అరుదైన ఘనత... తొలిసారి

  నందమూరి బాలకృష్ణకు హిందీలో పెద్దగా మార్కెట్‌ లేదు. అయినప్పటికీ ‘అఖండ' మూవీ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ సంస్థ దాదాపు రూ. 15 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది. తద్వారా ఈ సినిమాతో నటసింహా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సీనియర్ హీరోల్లో ఇంత మొత్తం ఎప్పుడూ రాలేదనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda Movie Under Boyapati Srinu Direction. This Film Hindi Dubbing Rights Sold Out for Huge Price.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X