ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టిన బాలయ్య: టాలీవుడ్‌లోనే రెండో హీరో.. నెవ్వర్ బిఫోర్ స్పీడుతో సత్తా

కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు చేసినా.. అవన్నీ ఆయనకు నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 'అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. ఎన్నో అంచనాల నడుమ వస్తున్న ఈ మూవీని టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో బాలయ్య రిలీజ్‌కు ముందే రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఉన్న ఓ అరుదైన ఫీట్‌ను దాటేశాడు నటసింహా. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రెండు సూపర్ హిట్ల తర్వాత ‘అఖండ'గా

రెండు సూపర్ హిట్ల తర్వాత ‘అఖండ'గా

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న చిత్రమే 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లు. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 'సింహా', 'లెజెండ్' వంటి భారీ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు చేస్తున్నాడు.

టైటిల్‌ రోర్‌తో గర్జించిన నందమూరి హీరో

టైటిల్‌ రోర్‌తో గర్జించిన నందమూరి హీరో

ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం టైటిల్‌ 'అఖండ' అని రివీల్ చేశారు. ఈ మేరకు టైటిల్ రోర్ అనే పేరిట ఓ వీడియోను సైతం విడుదల చేశారు. అందులో బాలయ్య అఘోరా పాత్రతో గర్జించారు. ఈ టీజర్‌‌లో బాలయ్య అఘోరా లుక్.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. బోయపాటి మార్క్ పవర్ ఫుల్ డైలాగ్ అదిరిపోయాయి. అందుకే దీనికి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది.

ఒక్క రోజులోనే అంతా... అవన్నీ వెనక్కే

ఒక్క రోజులోనే అంతా... అవన్నీ వెనక్కే

మాస్ కాంబినేషన్ కావడంతో 'అఖండ' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే వచ్చిన టీజర్ కూడా ఆకట్టుకుంది. ఫలితంగా దీనికి 24 గంటల్లోనే 11 మిలియన్ పైచిలుకు వ్యూస్‌ వచ్చాయి. దీంతో ఒక రోజులోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. తద్వారా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అదే సమయంలో బాలయ్య స్ట్రాంగ్ బ్యాక్ అయ్యారు.

టాలీవుడ్‌లోనే మొదటి హీరోగా బాలకృష్ణ

టాలీవుడ్‌లోనే మొదటి హీరోగా బాలకృష్ణ

'అఖండ' టీజర్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. RRR మోషన్ పోస్టర్ వీడియోకు నాలుగు వారాల్లో 7 మిలియన్ వ్యూస్, ఆ తర్వాత వచ్చిన 'భీమ్ ఫర్ రామరాజు' టీజర్‌కు నెలలో 12 మిలియన్ వ్యూస్ దక్కాయి. అయితే, బాలయ్య 'అఖండ' టీజర్‌కు మాత్రం కేవలం 25 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సొంతమయ్యాయి. అలాగే, తెలుగు సీనియర్ హీరోల రికార్డులు బ్రేకయ్యాయి.

సౌతిండియాలోనే ఏకైక హీరోగా నిలిచాడు

సౌతిండియాలోనే ఏకైక హీరోగా నిలిచాడు

తెలుగులోని సీనియర్ హీరోల టీజర్లకు వచ్చిన వ్యూస్ విషయంలో.. 'అఖండ'తో బాలయ్య కేవలం ఆరు రోజుల్లోనే నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి దక్షిణాది మీద ఆయన దండయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత 'కబాలీ' 37 మిలియన్ వ్యూస్‌ రికార్డును ఈ టీజర్ బద్దలు కొట్టేసింది. దీంతో బాలకృష్ణ సౌతిండియాలో నెంబర్ వన్ హీరోగా అవతరించారు.

Recommended Video

Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna
ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టిన బాలయ్య

ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టిన బాలయ్య

'అఖండ' టీజర్ వేగంగా దూసుకుపోతోంది. ఫలితంగా నిన్ననే 50 మిలియన్ వ్యూస్ మైలురాయిని చేరుకున్న ఈ వీడియో.. తాజాగా 51 మిలియన్ మార్కును కూడా చేరుకుంది. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' టీజర్‌ను దాటేసింది. దానికి 50.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక, తెలుగులో అల్లు అర్జున్ 'పుష్ప' టీజర్ మొదటి స్థానం (55 మిలియన్స్)లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X