‘అఖండ’ రికార్డుల జోరు.. బాలయ్యా, నీకు ఎదురెవరయ్యా !
నందమూరి నటసింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగానే నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు మామూలుగా ఉండవు. అలాంటి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఉగాది కానుకగా ఏప్రిల్ 13న ఈ సినిమా నుంచి విడుదలైన అఖండ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళుతోంది.
బాలయ్య కొత్త లుక్ తో పాటు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయే ఇవ్వడంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటూ ముందుకు వెళుతోంది. ఈ సినిమా టీజర్ కు ఎవరూ ఊహించనంతగా రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్యనే 35 మిలియన్ మైలురాయిని టచ్ చేసిన ఈ సినిమా 37 మిలియన్ వ్యూస్ సాధించిందని ఈ సినిమా నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో దక్షిణాది సీనియర్ స్టార్ హీరోస్ లో అత్యధిక వ్యూస్ సాధించిన రజనీ నటించిన సినిమా కబాలి టీజర్ ఇప్పటి వరకూ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు దాన్ని దాటేసి బాలయ్య టీజర్ మరింత ముందుకు వెళుతోంది...

టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు బాలయ్య కొత్తగా కనిపించడంతో ఈ టీజర్ మీద జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే మా బాలయ్య లెక్క గట్టిగానే ఉంది మా బాలయ్య కి తిరుగు లేదు అంటూ నందమూరి అభిమానులు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. సీనియర్ హీరోలలో చిరంజీవి నటించిన ఆచార్య టీజర్ కూడా ఇంకా 19 మిలియన్ల చేరువలోనే ఉంది. మొత్తం మీద బాలయ్య సినిమా బద్దలుకొడుతున్న రికార్డులతో బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అలా సీనియర్ హీరోలలో కూడా సీనియారిటీ చూపిస్తూ బాలయ్య మంచి జోరు మీదున్నాడు.


Click it and Unblock the Notifications











