ఎక్కడా తగ్గని అఖండ.. మళ్ళీ మరో మైలురాయి దాటేసి రచ్చ రేపుతున్న బాలయ్య !
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. తనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఈ మూడో సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఉగాది కానుకగా అదే రోజున అఖండ టీజర్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. ఇక ఆ టీజర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.. తెలుగులో మరే సీనియర్ హీరో సాధించినటువంటి ఫీట్ సాధించాడు బాలకృష్ణ. ఈ సినిమా టీజర్ వ్యూస్ రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 50 మిలియన్ న్యూస్ దాటినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.
కొంటె చూపులతో కవ్విస్తోన్న సమంత (బర్త్‌డే స్పెషల్ ఫొటోలు)
ఉగాది సందర్భంగా ఏప్రిల్13న మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో అఖండ టీజర్ విడుదలై యూట్యూబ్‌లో అపూర్వ ఆదరణతో దూసుకెళ్తూ కేవలం 16 రోజుల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50 మిలియన్స్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నాడు అని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. అందుకు ఊతం ఇచ్చేలా గత ఏడాది మొదట్లో బాలకృష్ణ పంచె కట్టు లో ఉన్న ఒక ఫోటో రిలీజ్ చేశారు. మొన్న ఉగాది రోజు రిలీజ్ చేసిన టీజర్ లో మాత్రం ఆయన ఒక సాధువులాగా శివుని వద్ద ఉంచి డైలాగులు చెబుతున్న విధానం చూస్తే ఆ ప్రచారం నిజమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తూన్నట్టు ఉన్నారు. అందుకే వ్యూస్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ పెడుతున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ వ్యూస్ ను తాజాగా పుష్ప సినిమా టీజర్ దాటేసింది.. ప్రస్తుతానికి అఖండ సినిమా టీజర్ వ్యూస్ యాభై మిలియన్ దాటితే పుష్ప 54 మిలియన్స్ దాటాయి. మొత్తం మీద బాలకృష్ణ సినిమా టీజర్ కు ఇంత విశేష ఆదరణ దక్కడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీజర్ కు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు అంటే సినిమా మీద కూడా ఇంతే ఆసక్తి చూపిస్తారు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











