నర్సులపై చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ వివరణ.. అసత్య ప్రచారం అంటూ సీరియస్ నోట్!

నందమూరి బాలకృష్ణ ఇటీవల ఊహించని విధంగా వరుసగా కొన్ని వివాదాలలో నిలుస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమధ్య వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్లో తొక్కినేని అనే వ్యాఖ్యలు చేయడంతో అక్కినేని అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేసింది. అలాగే అక్కినేని యువ హీరోలు కూడా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఆ విషయంలో అప్పుడే క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ ఎన్నటికీ అక్కినేని గారించి అలా తప్పుగా అనలేను అని అన్నారు. వారంటే ఎంతో గౌరవం అని కూడా చెప్పారు. ఇక ఇటీవల అన్ స్టాపబుల్ షోలో పాల్గొనగా అందులో నర్సులపై చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదానికి దారి తీశాయి. అయితే ఆ విషయంలో నందమూరి బాలకృష్ణ తనవైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అన్ స్టాపబుల్ షోలో..

అన్ స్టాపబుల్ షోలో..

నందమూరి బాలకృష్ణ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్వహించిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి భాగంలో బాలకృష్ణ వివిధ రకాల విషయాలపై స్పందిస్తూ ఒకసారి యాక్సిడెంట్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా ఒక నర్సు గురించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

బైక్ యాక్సిడెంట్ స్టోరీ

బైక్ యాక్సిడెంట్ స్టోరీ

బైక్ యాక్సిడెంట్ అయ్యి ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ మళ్ళీ పోలీస్ కేస్ అవుతుంది అనే కారణం చేత నిజం చెప్పకుండా కిందపడి దెబ్బ తగిలిందని అందరికి చెప్పాలని అనుకున్నాను. అయితే ఒక నర్సు అందంగా ఉండడంతో.. దానమ్మ ఆమెను చూసి నిజం చెప్పేశాను అని బాలయ్య బాబు వివరణ ఇచ్చాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నర్స్ అసోసియేషన్ సభ్యులు ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా సీరియస్ అయ్యారు.

ఖండించిన బాలయ్య..

ఖండించిన బాలయ్య..

వెంటనే బాలకృష్ణ క్షమాపణ చెప్పపని నర్సుల అసోసియేషన్ మీడియా ముందుకు వచ్చారు. ఇక ఆ విషయం సీరియస్ అవుతున్న తరుణంలో బాలకృష్ణ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నర్సులను కించపరిచారు అంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని బాలకృష్ణ ఒక నోట్ ద్వారా సోషల్ మీడియాలో తెలియజేశారు.

వారు నాకెంతో గౌరవం

వారు నాకెంతో గౌరవం

నా మాటలను కావాలనే వక్రీకరించారు రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం అని అందులో ఆయన పేర్కొన్నారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం.. అని అన్నారు.

 పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ...

పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ...

ఇక ఎంతగానో సేవలు అందిస్తున్న వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ... మీ నందమూరి బాలకృష్ణ.. అని వివరణ ఇచ్చారు. మరి బాలయ్య ఇచ్చిన వివరణతో ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X