బాలకృష్ణతో మరో మాస్ డైరెక్టర్.. వరుసగా 4 సినిమాలు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానులకు నచ్చే విధంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 4 సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల మరో మాస్ డైరెక్టర్ కూడా ఆయనతో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఖరారు చేశారు. నందమూరి బాలకృష్ణ రాబోయే నాలుగు సినిమాలకు ఏ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు అనే విషయాల్లో కి వెళితే..

Recommended Video

NBK107: Nandamuri Balakrishna's Next Grand Launch
వరుస అపజయాలు..

వరుస అపజయాలు..

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ముందు వరకు కూడా వరుసగా డిజాస్టర్స్ చూసిన విషయం తెలిసిందే. నిజానికి గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఆయన సరైన సక్సెస్ చూడలేదు. ఆ తర్వాత పూరి జగన్నాధ్ తో చేసిన పైసా వసూల్ అలాగే మిగతా సినిమాలు కూడా దారుణంగా ఫలితాలను అందుకున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహా నాయకుడు సినిమా కూడా డిజాస్టర్స్ కావడంతో బాలయ్య మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి.

 అఖండతో భారీ లాభాలు

అఖండతో భారీ లాభాలు

ఇక మొత్తానికి నందమూరి బాలకృష్ణ తన సక్సెస్ఫుల్ దర్శకుడు బోయపాటి శ్రీను తో మూడవసారి కలిసి అఖండ అనే సినిమా చేశాడు. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ అందుకొని ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇక మూడవ సారి అఖండ సినిమా తెరపైకి రాబోతోంది అనగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక సినిమా ఈజీగా సక్సెస్ అవుతుందని కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. దానికి తోడు సినిమా ట్రైలర్ టీజర్స్ కూడా మంచి హైప్ క్రియేట్ చేయడం తో బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఫైనల్ గా బాలకృష్ణ తన ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ సినిమా వేసుకున్నాడు. అఖండ సినిమా మొత్తంగా నిర్మాతలకు 40 నుంచి 50 కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించినట్లు తెలుస్తోంది.

క్రాక్ దర్శకుడితో..

క్రాక్ దర్శకుడితో..

ఇక నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో చేయబోయే సినిమాలు కూడా అంతకు మించి అనేలా ఉంటాయి అని అర్థం అవుతోంది. వీలైనంతవరకు మంచి కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ అభిమానులకు నచ్చే విధంగా మాస్ కమర్షియల్ సినిమాలు కూడా ఉండాలని బాలయ్య బాబు జాగ్రత్త పడుతున్నాడు. ఇక ప్రస్తుతం యువ దర్శకులతో కూడా సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నే తెరపైకి రాబోతోంది. గోపీచంద్ మలినేని కూడా ప్రస్తుతం హిట్ ట్రాక్ లోనే ఉన్నాడు. అతను గత ఏడాది క్రాక్ సినిమాతో మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ ఏడాది సమ్మర్ అనంతరం వారి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరో రెండు సినిమాలు

మరో రెండు సినిమాలు

గోపీచంద్ మలినేని సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ మరొక మూడు సినిమాలను కూడా లైన్లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముందు నుంచి కూడా అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కలయికలో రామారావు అనే సినిమా వస్తుందని ప్రచారం కూడా జరిగింది. నిజానికి బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. ఇక ఇప్పుడు ఒక పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంటుందట. అఖండ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు ఆ మధ్యలో చాలా కథనాలు వెలువడ్డాయి. తప్పకుండా మరోసారి బాలకృష్ణ తో సినిమా చేస్తారని తెలుస్తోంది.

 క్లారిటీ ఇచ్చిన మరో డైరెక్టర్

క్లారిటీ ఇచ్చిన మరో డైరెక్టర్


ఇక ఇటీవల సంపత్ నంది కూడా బాలకృష్ణ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఫైనల్ గా ఒక స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది అని కూడా తెలియజేశారు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వెళుతుందని చెబుతూ బాలకృష్ణ అందుకు తగ్గట్లుగానే అభిమానులకు నచ్చే విధంగా సినిమా సిద్ధమవుతోందని సంపత్ నంది అన్నారు. సంపత్ నంది చివరగా సీటీమార్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక బాలకృష్ణ అఖండ సినిమా సక్సెస్ అనంతరం తన రెమ్యూనరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే 11 కోట్లకు పైగా పారితోషికాన్ని అందుకున్న బాలయ్య బాబు ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాలలో లైన్ లో పెట్టారు అంటే తప్పకుండా అంతకుమించి ఆదాయాన్ని అందుకుంటారు అని చెప్పవచ్చు. సాధారణంగా ఒక సినిమాకు బాలకృష్ణ 13 నుంచి 15 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకునే అవకాశం ఉందట. అంటే రాబోయే నాలుగు సినిమాలకు మొత్తంగా నందమూరి బాలకృష్ణ 50 కోట్ల వరకు ఆదాయాన్ని అందుకుంటారు అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X