షాకిస్తోన్న బాలకృష్ణ కొత్త లుక్: లీకైన గెటప్ అసలు రహస్యం ఇదే.. విలన్లుగా ఇద్దరు బడా హీరోలు!

నందమూరి తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచే భారీ విజయాలను అందుకుంటోన్న ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఏజ్ బార్ అవుతున్నా.. సినిమా విషయంలో సాహసాలు చేయడానికి సిద్ధ పడే బాలయ్య.. బోయపాటి శ్రీనుతో చేస్తున్న మూవీ కోసం ఎన్నో ప్రయోగాలకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే షాకింగ్ లుక్‌లో కనిపించబోతున్నారు. తాజాగా ఆ గెటప్ లీకైపోయింది. వివరాల్లోకి వెళ్తే...

ఒకటి కాదు.. ఏకంగా మూడు డిజాస్టర్లతో

ఒకటి కాదు.. ఏకంగా మూడు డిజాస్టర్లతో

కెరీర్ ఆరంభం నుంచే జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే, 2019లో ఆయన ఏకంగా మూడు సినిమాలు (యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు, రూలర్) చేశాడాయన. ఇవన్నీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవలేదు.

హ్యాట్రిక్ కంటే హిట్ ముఖ్యం.. స్పెషల్‌గానే2

హ్యాట్రిక్ కంటే హిట్ ముఖ్యం.. స్పెషల్‌గానే2

నందమూరి బాలకృష్ణ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. అదే సమయంలో 'వినయ విధేయ రామ' వంటి ఫ్లాప్ మూవీతో వెనకడుగు వేశాడు బోయపాటి శ్రీను. సరైన హిట్ కోసం వేచి చూస్తున్న ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

టాలీవుడ్‌లోనే తొలిసారి.. అలాంటి పాత్రలో

టాలీవుడ్‌లోనే తొలిసారి.. అలాంటి పాత్రలో

'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అంతేకాదు, ఇందులో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి అఘోరా పాత్ర కూడా ఉంది. గతంలో తెలుగులో ఏ హీరో కూడా ఇలాంటి పాత్రను పోషించలేదు.

ఒక్క వీడియోతో... అంచనాలు... బిజినెస్

ఒక్క వీడియోతో... అంచనాలు... బిజినెస్

నిజానికి హిట్ కాంబోనే అయినా BB3పై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. పైగా దీని ఖర్చును కూడా తగ్గిస్తున్నారన్న టాక్ వినిపించింది. ఇలాంటి సమయంలోనే ఫస్ట్ రోర్ పేరిట ఓ టీజర్ విడుదలైంది. దీనికి ఎవరూ ఊహించని రీతిలో స్పందన వచ్చింది. దీంతో బజ్ విపరీతంగా పెరగడంతో పాటు వ్యాపారం కూడా గణనీయంగా జరిగినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

లీకైన బాలకృష్ణ కొత్త లుక్.. గాడ్ ఫాదర్‌గా

లీకైన బాలకృష్ణ కొత్త లుక్.. గాడ్ ఫాదర్‌గా

ఎన్నో అంచనాల నడుమ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఉగాది కానుకగా దీన్ని రివీల్ చేయబోతున్నారు. అలాగే, బాలయ్య సరికొత్త లుక్‌ను కూడా ఆరోజే వదలబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటసింహా చేస్తున్న పాత్రకు సంబంధించిన లుక్ తాజాగా లీకైపోయింది. ఇది షాక్‌కు గురి చేస్తోంది.

అసలు రహస్యం ఇదే.. విలన్లుగా హీరోలు

అసలు రహస్యం ఇదే.. విలన్లుగా హీరోలు

తాజాగా బయటకు వచ్చిన ఫోటోల్లో బాలయ్య హోళీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో ఆయన విగ్గు లేకుండా ఒరిజినల్ గెటప్‌తో కనిపిస్తున్నారు. ఇదే అఘోరా పాత్రకు సంబంధించిన లుక్ అని.. అందులో ఇంకొన్ని మార్పులు చేస్తారని తెలుస్తోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో తెలుగు స్టార్ శ్రీకాంత్‌తో పాటు కోలీవుడ్ హీరో శరత్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X