Balakrishna Remuneration: ఏంటి బాలయ్య రెమ్యూనరేషన్ అన్ని కోట్లా.. 3 హిట్లతో 4 రెట్లు పెంచేశాడుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్లతో సత్తా చాటుతోన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆ మధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన ఆయన.. 'అఖండ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు.
ఆ వెంటనే 'వీర సింహా రెడ్డి'తో మళ్లీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య 'భగవంత్ కేసరి'తో ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇలా విజయాల పరంపరతో సత్తా చాటుతోన్న బాలయ్య.. రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలిసింది. ఆ పూర్తి వివరాలకై మొత్తం చదివేయండి మరి!

భగవంత్ కేసరిగా బాలయ్య రాక: రెండు వరుస హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకులు దీనికి రెండు వారాలుగా మంచి రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం భారీ కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఇలా హిట్ స్టేటస్‌కు మరింత దగ్గరకు వచ్చింది.

బాబీతోనే క్రేజీ ప్రాజెక్టు అప్పుడే: నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీని నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ లీక్ అయింది. డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోయే ఈ సినిమాను నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.
హాట్ టాపిక్‌గా రెమ్యూనరేషన్స్: నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో సత్తా చాటుతోన్నారు. దీంతో ఆయన మిగిలిన హీరోల మాదిరిగా కాకుండా డీసెంట్‌గానే రెమ్యూనరేషన్‌ను పెంచుతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాంటిది బాబీ సినిమాకు ఏకంగా కొన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారిపోయింది.
రూలర్ 7.. ఇప్పుడు 28 కోట్లు: నటసింహా నందమూరి బాలకృష్ణ తన 105వ సినిమాగా వచ్చిన 'రూలర్' మూవీకి కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారు. అలాంటిది వరుసగా హిట్లు రావడంతో ఆయన డిమాండ్ పెరిగిపోయింది. ఫలితంగా ఇప్పుడు బాబీతో చేయబోయే తన 109వ సినిమా కోసం ఏకంగా బాలయ్య రూ. 28 కోట్లు చార్జ్ చేస్తున్నారట. అంటే ఆయన నాలుగు రెట్లు పెంచేశారు.

అఖండ నుంచి భగవంత్‌కు: 'రూలర్' సినిమాకు రూ. 7 కోట్లు రెమ్యూనరేషన్ మాత్రమే అందుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. 'అఖండ' చిత్రానికి గానూ రూ. 10 కోట్లు చార్జ్ చేశారు. ఇది హిట్ కావడంతో రెమ్యూనరేషన్‌కు పెంచేశారు. ఫలితంగా 'వీర సింహా రెడ్డి'కి రూ. 15 కోట్లు తీసుకున్నారు. ఇక, ఇటీవలే విడుదలైన 'భగవంత్ కేసరి' చిత్రానికి రూ. 20 కోట్లు అందుకున్నారని తెలిసింది.
చిరంజీవిదే టాప్ ప్లేస్ అని: టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఏకంగా రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఆయన తర్వాత నందమూరి బాలకృష్ణ రూ. 28 కోట్లు చార్జ్ చేస్తున్నారు. మరో ఇద్దరు సీనియర్ హీరోలు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున మాత్రం రూ. 10 - 12 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారని ఫిలిం నగర్ ఏరియా సమాచారం.


Click it and Unblock the Notifications











