Balakrishna : దటీజ్ బాలయ్య.. డూప్ లేకుండా ఆ సీన్ చేసాడట.. ఇన్నాళ్లకి బయటపడ్డ సీక్రెట్!
నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన తండ్రి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఏ సినిమా చేసిన రికార్డుల వర్షం కురిపించడానికి ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే లెజెండ్ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చాలా కాలం తర్వాత ఆయన బయటపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే...
వచ్చిన మూడు సినిమాలు హిట్టే...:నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ లుగా నిలిచాయి. అయితే ఈ మూడు సినిమాల్లోకి వీరిద్దరూ కలిసి చేసిన రెండో సినిమా మీద అందరికీ ఆసక్తి ఉంటుంది. అదే లెజెండ్. వీరిద్దరూ కలిసి ముందుగా సింహ అనే సినిమా చేశారు 2009 ప్రాంతంలో రిలీజ్ అయిన సింహా సినిమా అద్భుతమైన హిట్టు అందుకుంది.

బోయపాటి బాలయ్య కాంబో సూపర్ హిట్...:ఆ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అనగానే ఆ కాంబినేషన్ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా వీరిద్దరూ కలిసి చేసిన లెజెండ్ సినిమా 2014 ఎన్నికలకు ముందు వచ్చి సూపర్ హిట్ అయింది. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. రామ్ మాచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు.
డూప్ లేకుండా ఫైట్ సీక్వెన్స్..:రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలై సుమారు 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో నిన్న హైదరాబాదులో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే రేపు ఈ సినిమాని పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ తాను వైజాగ్ లో చేసిన ఒక ఫైట్ సీక్వెన్స్ గురించి మాట్లాడారు. లెజెండ్ సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. వైజాగ్ బీచ్ రోడ్ లో గుర్రం మీద నందమూరి బాలకృష్ణ సవారి చేస్తున్న ఈ సీన్ అప్పట్లో సూపర్ హైలైట్ అయింది.

దటీజ్ నందమూరి బాలయ్య...:ఇక ఈ సీన్ చేస్తున్న సమయంలో గుర్రంతో పాటు అద్దం పగలగొట్టుకుని రావాల్సిందిగా సీన్ ప్లాన్ చేశారట. అయితే నందమూరి బాలకృష్ణకు ఇబ్బంది అవుతుందేమోనని ముందు డూప్ తో పని నడిపించాలని డైరెక్టర్ అనుకుంటే నందమూరి బాలకృష్ణ మాత్రం నాకేం భయం నేనే చేసేస్తానని ముందుకు వచ్చారట. అలా రావడం వెంటనే గుర్రంతో సహా అద్దం బాగా ముద్దలు కొట్టుకునే ముందుకు వెళ్లడం వెంటనే జరిగిపోయాయని ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాక రీ రిలీజ్ లో కూడా సినిమాని చూసి ఆదరించాలని ఆయన తన అభిమానులను కోరారు


Click it and Unblock the Notifications











