కమల్ DNA.. ఎన్టీఆర్ DNA కలిస్తే రచ్చే.. శృతిహాసన్‌పై బాలయ్య ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు మలినేని గోపిచంద్ రూపొందించిన చిత్రం వీరసింహారెడ్డి.
నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, శృతిహాసన్, హాని రోజ్, చంద్రిక, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరిగింది. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ..
వీరసింహరెడ్డి సినిమాలో ఫ్యాక్షన్ ఎందుకంటే.. సినిమా చూస్తే చాలా కథ ఉంది. అఖండ, సమరసింహారెడ్డిని మించి ఈ సినిమా చరిత్రలో మిగులుతుంది. ఇక శృతిహాసన్ గురించి మాట్లాడుతూ.. భారతీయ సినీ ప్రపంచంలోనే విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె. ఆమె కమల్ హాసన్, నేను ఎన్టీఆర్ డీఎన్‌ఏతో పుట్టిన వాళ్లం. అలాంటి డీఎన్‌ఏతో పుట్టిన వాళ్లు కలిస్తే ఎలా ఉంటుందో తెర మీద చూడాల్సిందే. అందంతోనే కాకుండా ఈ సినిమాలో శృతిహాసన్ నటన బాగుంది.

ఇక హాని రోజ్ గురించి మాట్లాడుతూ.. ఈ అమ్మాయి పాత్ర గురించి చెప్పను. ఈ అమ్మాయిని చూస్తే.. పాత సినిమాలో హీరోయిన్‌గా ఉంటుంది. ఈమెకు తెలుగులో తొలి సినిమా. ఈ అమ్మాయిని చూడగానే.. భలే అమ్మాయిని పట్టేసారనిపించింది. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. సినిమా చూసిన తర్వాత ఆమె గురించి మాట్లాడుకొంటారు. బ్రహ్మండంగా పాత్ర ఉంటుంది అని బాలకృష్ణ చెప్పారు.
కన్నడ భాషలో పెద్ద నటుడు దునియా విజయ్ పాత్ర బాగుంటుంది. కన్నడ భాష నుంచి వచ్చి తెలుగు సినిమాలో నటించడం మైత్రికి చిహ్నం అని అన్నారు. ఈ సినిమాలో అజయ్ ఘోష్ మంచి నటనను ప్రదర్శించారు. మైలురాయికే మీసం మొలిచినట్టు ఉన్నాడు అంటూ అజయ్ ఘోష్ డైలాగ్ కట్టాడు.
ఇక సప్తగిరి టైమింగ్ బాగుంటుంది. ఆయనను చూసి నేను కామెడీ టైమింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది. నేను అనసూయమ్మ గారి అల్లుడు, మంగమ్మ గారి మనవడు సినిమా చేసినా.. కామెడీ టైమింగ్ రాలేదు. సప్తగిరి కామెడీ టైమింగ్ నేను నేర్చుకోవాలి. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ తూటల్లా పేలుతాయి. పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆలరిస్తాయి అని బాలకృష్ణ అన్నారు.

తమన్ మ్యూజిక్‌తో అఖండ సినిమా అమెరికాలో బాక్సులు బద్దలయ్యాయి. అలాంటి సౌండ్, రీరికార్డింగ్‌తో సౌండ్ బాక్సులు బద్దలవుతాయి అని న్నారు.


Click it and Unblock the Notifications











