Taraka Ratna: రాత్రుళ్ళు కూడా హాస్పిటల్ లోనే బాలయ్య.. ఆయనను ఇలా ఎప్పుడు చూసి ఉండరు!

నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని హాస్పిటల్ లోనే చికిత్స అందుకుంటున్న విషయం తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు చాలామంది సెలబ్రిటీలు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తారకరత్న పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉంది అని వారి సన్నిహితులు చెబుతున్నారు.

ఇక నందమూరి బాలకృష్ణ గత రెండు రోజుల నుంచి నందమూరి తారకరత్న కోసమే ఆలోచిస్తున్నారు. ఇప్పటికి హాస్పిటల్ లోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మెరుగైన వైద్యం కోసం

మెరుగైన వైద్యం కోసం

ఇటీవల లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో కుప్పంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ అతనికి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అని తెలియడంతో అందరూ ఒక్కసారిగా కంగారుపడ్డారు.

ఇక మళ్ళీ సాధారణ పరిస్థితిలోకి వచ్చినప్పటికీ కూడా తారకరత్న పరిస్థితి మళ్లీ క్రిటికల్ గా మారడంతో వైద్యులు బెంగళూరు హాస్పిటల్ కు తీసుకు వెళితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు.

తారకరత్న వెంటే బాలయ్య

తారకరత్న వెంటే బాలయ్య

ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరులోని హృదయాలయ అనే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే నందమూరి కుటుంబ సభ్యులకు కూడా చాలామంది ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు. ఇక బాలయ్య బాబు అయితే గత రెండు రోజులుగా తారకరత్న వెంటే ఉంటున్నారు.

ఆ సమస్యలో తారకరత్న

ఆ సమస్యలో తారకరత్న

వైద్యుల సమాచారం ప్రకారం తారకరత్నకు మెలెనా వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. మెలెనా కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతోందని మెలెనా వల్ల అధిక ఆయాసంతో కుప్పకూలే లక్షణాలు ఉంటాయాని బ్లీడింగ్ వల్ల పలు భాగాలకు రక్త ప్రసరణ కూడా ఆగినట్లు చెబుతున్నారు. ఇక ECMO చికిత్స అందిస్తున్న వైద్యులు బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా తారకరత్నకు బ్లడ్‌పంపింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య ఫొటో వైరల్

బాలయ్య ఫొటో వైరల్

ఇక తారకరత్న స్పృహ తప్పి పడిపోయినప్పటి నుంచి అలాగే ఇప్పుడు బెంగళూరు తీసుకువచ్చే వరకు కూడా ప్రతి చోటా బాలయ్య బాబు కనిపిస్తూనే ఉన్నారు. ఇక ఆయన ఇప్పటికి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లోనే ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన చాలా దీనంగా నిలబడి కనిపిస్తూ ఉండడం ఫాన్స్ ను కూడా కలవరపెడుతోంది.

ప్రత్యేక విమానంలో ఎన్టీఆర్

నందమూరి తారకరత్న అంటే బాలయ్యకు చాలా ఇష్టం. ఆయన సపోర్ట్ ద్వారానే తారకరత్న సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అతను కోలుకోవాలని బాలయ్య బాబు వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఇక బెంగుళూరు హాస్పిటల్ కు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ప్రత్యేక విమానంలో వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X