పేదల ఆకలి తీరుస్తున్న నందమూరి బాలకృష్ణ.. 100 వ రోజు పేదవారికి స్పెషల్ భోజనం
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కేవలం వెండితెర పైన మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సేవా కార్యక్రమాలతో జనాలను ఆకట్టుకునే వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ముందుంటారు. ఇప్పటికే ఆయన బసవతారకం ఆసుపత్రితో ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ కు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది కూడా ఎంతో మందికి క్యాన్సర్ పేషెంట్స్ కు కార్పోరేట్ వైద్యాన్ని అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు. అయితే తన సొంత నియోజకవర్గంలో కూడా బాలకృష్ణ నిత్యం ఏదో ఒక సేవ కార్యక్రమంలో జనాలకు దగ్గరవుతూ ఉంటారు.
ఇక పేదల ఆకలి తీర్చేందుకు ఇటీవల ఆయన నిర్వహించిన ఒక కార్యక్రమం కూడా మంచి గుర్తింపును అందుకుంది. హిందూపురంలో కొన్ని నెలల క్రితం మొదలుపెట్టిన అన్నగారి భోజనశాలకు భారీ స్పందన వచ్చింది. పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్న క్యాంటీన్లను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ కూడా ప్రత్యేకంగా అన్నగారి భోజనశాల పేరుతో నిర్వహించిన ఉచిత అన్నదాన కార్యక్రమం ఎంతోమంది పేదవారి ఆకలి తీరుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ కార్యక్రమం మొదలుపెట్టి వంద రోజులు పూర్తి కావడంతో నందమూరి బాలకృష్ణ మేరకు ఈరోజు ప్రత్యేకమైన భోజనం కూడా ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక కేవలం రెండు రూపాయలకే ఈ రుచికరమైన భోజనం అందిస్తూ ఉండడంతో చాలామంది పేదల నుంచి మంచి స్పందన వస్తోంది. నందమూరి బాలకృష్ణ నిజమైన హీరో అంటూ హిందూపురం అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఇక నందమూరి బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య బాబు తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఇక వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ పనులను పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్య బాబు తన 108వ సినిమాను చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది.


Click it and Unblock the Notifications











