‘రామారావు’గా రాబోతున్న బాలకృష్ణ: కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్రలో.. నందమూరి ఫ్యాన్స్‌కు పండగే

కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులు అన్న భేదం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెడుతూ దూకుడును ప్రదర్శిస్తున్నారు. అందుకే ఆయనంత వేగంగా సినిమాలు చేస్తున్నారు. 2019లో ఏకంగా మూడు చిత్రాలను అందించిన బాలయ్య.. ఇప్పుడు బోయపాటితో 'అఖండ' చేస్తున్నారు. దీనితో పాటు గోపీచంద్ మలినేనితోనూ సినిమా ప్రకటించారు. ఇవి కాకుండా తాజాగా అనిల్ రావిపూడికీ ఓకే చెప్పారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ’గా గర్జించబోతున్న నటసింహం

‘అఖండ’గా గర్జించబోతున్న నటసింహం


'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో బాలయ్య అఘోరాగా, రైతుగా నటిస్తున్నారు.

విడుదలకు ముందే రికార్డుల ‘అఖండ’

విడుదలకు ముందే రికార్డుల ‘అఖండ’

బాలయ్య నటిస్తున్న 'అఖండ' మూవీ టీజర్ ఉగాదికి విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తద్వారా ఈ టీజర్ 24 గంటల్లోనే 11 మిలియన్ పైచిలుకు వ్యూస్‌ను రాబట్టింది. ఫలితంగా ఒక రోజులోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. అలాగే, ఇప్పటికే 31 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది.

అతడితో రియల్ స్టోరీతో వస్తున్నాడుగా

అతడితో రియల్ స్టోరీతో వస్తున్నాడుగా

ఈ సంక్రాంతికి 'క్రాక్' విజయంతో జోష్‌లో ఉన్న గోపీచంద్ మలినేని.. వెంటనే నటసింహా నందమూరి బాలకృష్ణకు ఓ స్టోరీ లైన్ వినిపించాడు. దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో అధికారికంగానే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందుకోసం ఎప్పుడో స్క్రిప్ట్ వర్కును కూడా ప్రారంభించేశాడు. రియల్ స్టోరీతో రానున్న ఈ మూవీ కోసం చరిత్రను వెదుకుతున్నాడతను.

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌కు పచ్చజెండా ఊపి

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌కు పచ్చజెండా ఊపి


ప్రస్తుతం 'అఖండ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలయ్య.. ఇది పట్టాలపై ఉండగానే గోపీచంద్ మలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బోయపాటి సినిమా పూర్తయిన వెంటనే ఇది ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన అనిల్ రావిపూడితో కూడా సినిమా చేయడానికి ఆయన పచ్చజెండా ఊపారు. ఈ విషయం రెండు రోజుల క్రితమే తెలిసింది.

‘రామారావు’గా రాబోతున్న బాలకృష్ణ

‘రామారావు’గా రాబోతున్న బాలకృష్ణ

'అఖండ' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. అలాగే, గోపీచంద్ చేయబోయే సినిమా వాస్తవిక ఘటన ఆధారంగా రూపొందనుంది. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడితో నటసింహా చేయాల్సిన సినిమా వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. ఇక, ఈ సినిమా అప్పుడెప్పుడో వినిపించిన 'రామారావు గారు' స్క్రిప్టుతోనే రూపొందనుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Recommended Video

Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
కెరీర్‌లోనే మొదటిసారి అలాంటి పాత్రలో

కెరీర్‌లోనే మొదటిసారి అలాంటి పాత్రలో

కల్యాణ్ రామ్‌తో 'పటాస్' చేసిన తర్వాత అనిల్ రావిపూడి.. బాలయ్యకు 'రామారావు గారు' కథను వినిపించాడు. అప్పుడది పట్టాలెక్కలేదు కానీ.. ఇప్పుడు రాబోతుందట. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందనుందని అంటున్నారు. అంతేకాదు.. కెరీర్‌లోనే తొలిసారి ఇందులో పూర్తి స్థాయి హాస్యభరితమైన పాత్రలో నటించబోతున్నారట నందమూరి బాలకృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X