నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు.. హాజరయ్యే అతిథులు వీరే?

Nandamuri Balakrishna 50Years Celebrations: తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణను ఘనంగా సన్మానించేందుకు టాలీవుడ్ సిద్దమైంది. నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు పేరిట అంగరంగ వైభవంగా , అత్యంత ఘనంగా వేడుక నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకను సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని నోవోటెల్ హైటెక్స్‌లో సాయంత్రం 6 గంటల నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్ కు సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు, ఇతర సెలబ్రెటీలు హాజరు కానున్నారు. అయితే.. ఇప్పటి వరకూ ఎవరెవరికి కార్డు అందించారు. ఈవెంట్ కు వచ్చే అథితులు ఎవరు? అని తెగ సెర్చ్ చేస్తున్నారు బాలయ్య బాబు డై హార్ట్ ఫ్యాన్స్.

స్పెషల్ ఇన్విటేషన్ కార్డు

నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల సందర్బంగా ఓ స్పెషల్ ఇన్విటేషన్ కార్డును డిజైన్ చేశారంట. తాజాగా ఓ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇన్విటేషన్ కార్డులో నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలున్నాయి. 1974 - 2024 వరకు బాలయ్య తన కెరీర్ లో 109 సినిమాలు చేయగా.. అందులో 129 మంది హీరోయిన్లతో బాలయ్య నటించారని పేర్కొన్నారు. ఆయన సినిమాలు రూ.10 లక్షల నుంచి రూ.250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయని, కోట్లాది మంది అభిమానులను సంపాందించుకున్న ఆయనకు తన అభిమానులు 10 ఫీట్ల నుంచి 108 ఫీట్ల కటౌట్స్ పెట్టారని ఇందులో వెల్లడించారు. అలాగే.. ఆయన సినిమాలు 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన రికార్డు క్రియేట్ చేశాయని, ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ రాణించారనీ, పైగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలుపొందారని ఏకైక నటుడు బాలకృష్ణ నేనని ఈ ఇన్విటేషన్ లో పేర్కొన్నారు.

Nandamuri Balakrishna Golden Jubilee Celebrations these are the special guests

అతిథులు వీరే..

నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవాన్ని భారీ ఏర్పాటు చేస్తుంది టాలీవుడ్‌. సెప్టెంబరు 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్‌ సభ్యులు. తమిళ, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీస్ ఆహ్వానించనున్నారు.
ఇప్పటి వరకూ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, వెంక‌టేశ్‌, నాగార్జున‌. ప్ర‌భాస్‌, మ‌హేశ్‌బాబు, రామ్‌చ‌ర‌ణ్‌, శ‌ర్వానంద్‌, గోపీచంద్‌, విశ్వ‌క్ సేన్‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, నాని, రానా, అడ‌వి శేష్‌ల‌కు ఆహ్వానాలందాయి.

అలాగే.. తమిళ నటులు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హ‌స‌న్, సూర్య‌, విశాల్‌, విజయ్‌ సేతుపతి, శివ కార్తికేయన్‌, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌లకూ ఆహ్వాన పత్రికలు అందించారు. అలాగే హీరో కిచ్చ సుదీప్, దునియా విజయ్, దర్శకులు పి. వాసు, నాజర్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ , హీరోయిన్స్ సుహాసిని, మీనా, మాలా శ్రీ , సుమలత తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించారు. మ‌ల‌యాళం ఇండస్ట్రీలో మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి, దుల్క‌ర్ స‌ల్మాన్ ఆహ్వానించారు. బాలీవుడ్ హీరోలకు కూడా షారుఖ్ ఖాన్‌, స‌న్నీ డియోల్‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌ల‌కు ప్ర‌త్యేక ఆహ్వానాలందించారంట.

Nandamuri Balakrishna Golden Jubilee Celebrations these are the special guests
రాజకీయ ప్రముఖుల విషయానికి వస్తే.. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర పొలిటికల్ లీడర్లను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటివరకూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి లకు ఆహ్వనాలు అందాయంట. అటు.. ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ప్రత్యేక ఆహ్వానం అందిచారు. ఈ సెలబ్రేషన్స్ కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించటానికి టాలీవుడ్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, తెలుగుఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ తదితరులు వెళ్లారు. అలాగే.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ను కూడా ఈ వేడుక‌లకు ఆహ్వానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X