Balakrishna: మారిపోయిన బాలకృష్ణ బిరుదు.. 'యువరత్న' నుంచి ఇప్పటివరకు ఎన్నో తెలుసా?
నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి మంచి హిట్స్ అందుకున్న ఆయన లైన్ లో అనేక సినిమాలు ఉంచారు. తాజాగా NBK108 మూవీకి భగవంత్ కేసరి అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే ఇంతకాలం బాలయ్య బాబును నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ పిలుచుకున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు ఆ బిరుదు మారిపోయింది. బాలయ్యకు సరికొత్త నేమ్ వచ్చేసింది. అదేంటనే వివరాల్లోకి వెళితే..
యువరత్న బిరుదు:నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. బాలయ్య బాబుకు మొదట్లో 'యువరత్న' అనే బిరుదును ఇచ్చారు అభిమానులు. ఈ 'యువరత్న' బిరుదు బాలకృష్ణకు చాలా కాలం పాటు కొనసాగింది.

నట సింహం అంటూ:'యువరత్న' బిరుదు తర్వాత 'సింహా' పదంతో ఉన్న సినిమా టైటిల్స్ ఎక్కువగా వచ్చాయి. అలా టైటిల్స్ రావడం, అవి కాస్తా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో బాలయ్య బాబుకి 'నట సింహం అనే పేరు బిరుదుగా మారింది. గత కొన్నేళ్లుగా బాలకృష్ణను అభిమానులు 'నట సింహం' అనే పిలుచుకునే వాళ్లు.

గాడ్ ఆఫ్ మాసెస్ అని:ఇక ఇటీవల వీర సింహా రెడ్డి సినిమాతో బాలకృష్ణ బిరుదు 'గాడ్ ఆఫ్ మాసెస్'గా మారింది. ఈ పేరు కూడా నందమూరి అభిమానులకు ఎంతగానో నచ్చింది. సంక్రాంతికి విడుదలైన వీర సింహా రెడ్డి మూవీ కూడా మంచి హిట్ కొట్టింది. అలా సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ పెరగడమే కాకుండా అభిమానులు ఆయన్ను పిలుచుకునే బిరుదు కూడా మారుతూ వచ్చింది.

తాజా బిరుదు:ఇప్పుడు మరోసారి బాలకృష్ణ బిరుదు మారింది. అదేంటంటే 'గ్లోబల్ లయన్'. అవును నందమూరి నటసింహానికి ఇప్పుడు మారిన తాజా బిరుదు 'గ్లోబల్ లయన్'. బాలకృష్ణ-అనిల్ రావిపూడి NBK108 ఫిల్మ్ 'భగవంత్ కేసరి' టైటిల్ అనౌన్స్ మెంట్ కంటే ముందుగా ఈ బిరుదును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్.
టాప్ ట్రెండింగ్:జూన్ 10న బాలయ్ బర్త్ డే సందర్భంగా జూన్ 8న భగవంత్ కేసరి టైటిల్ అనౌన్స్ మెంట్ తో వేడుకలు ప్రారంభమయ్యాయి. నరసింహా నాయుడు మూవీని రిలీజ్ కూడా చేయనున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ లయన్ అనే బిరుదును ప్రకటిస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కొత్త బిరుదు టాప్ ట్రెండింగ్ గా మారింది. కాగా ఈ బిరుదుతో అభిమానులు పండుగ చేసుకుంటే పలువురు మాత్రం విమర్శలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











