Balakrishna: అద్దంలో చూసుకుంటే నన్ను నేనే గుర్తుపట్టలేదు... బాలయ్య షాకింగ్ కామెంట్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి జోష్ మీద ఉన్నారనే చెప్పాలి. సంక్రాంతికి వీరసింహా రెడ్డితో వచ్చి హిట్ కొట్టిన బాలయ్య... ఈ దసరాకి భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇక ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు.. బాలయ్య కూడా పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో బాలయ్య తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే....
నందమూరి బాలయ్య.. అఖండ నుంచి విజయపరంపర కొనసాగిస్తున్నాడు. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య.. ఆ తర్వాత అన్ స్టాపబుల్ సీజన్స్ తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఈ అన్ స్టాపబుల్ సీజన్స్ సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇక ఈ ఏడాది వీరసింహరెడ్డి సినిమాతో సంక్రాంతికి వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా బంపర్ హిట్టగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక ఈ దసరా పండక్కి అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా... టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు ధీటుగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించాడు. ఎస్ఎస్ తమన్ అదిరిపోయే సంగీతం అందించాడు. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఇక భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. చిత్రబృందం విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. ఇక ఈ వేడుకల్లో దర్శక నిర్మాతలతో పాటు.. బాలయ్య, శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక బాలకృష్ణ ఈ వేడుకల్లో కొత్త లుక్ లో దర్శనం ఇచ్చారు. సినిమా కోసం గడ్డం పెంచిన ఆయన.. గడ్డం లేకుండా క్లీన్ షేవ్ తో కనిపించారు. ఆయన్ని చూసి అభిమానులు అయితే షాక్ అయ్యారు. కొత్త లుక్ లో బాలయ్య బాగున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక బాలయ్య ఈ వేడుకల్లో మాట్లాడుతూ... ఈ నవరాత్రుల్లో స్త్రీ శక్తి గురించి బాలయ్య మాట్లాడారు. అంతే కాదు.. భగవంత్ కేసరి సినిమాలో కూడా స్త్రీ గొప్పతనం గురించి ఉందని తెలిపారు. ఇక ఇది తన 108వ సినిమా.. ఇది మంచి సంఖ్య అంటూ చెప్పుకువచ్చారు. ఇక తన గడ్డం గురించి మాట్లాడుతూ... భగవంత్ కేసరి కోసం గడ్డం పెంచినట్లు.. మొదటి సారిగా గడ్డం తీసేస్తే.. తనను తానే గుర్తుపట్టలేకపోయానని నవ్వుతూ వెల్లడించారు.

గడ్డం తీయడం వెనకున్న కారణాన్ని చెబుతూ.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నానని తెలిపారు బాలయ్య. అందుకోసమే ఈ గడ్డం తీసినట్టు.. గడ్డం తీసేసిన తర్వాత అద్దంలో చూసుకుంటే నన్ను నేనే గుర్తుపట్టలేదు అంటూ వెల్లడించారు. వచ్చే నెలలోనే ఇది సెట్స్‌పైకి వెళ్తున్నట్టు తెలిపారు. కాగా భగవంత్ కేసరి సినిమాలో తనతో కలిసి నటించిన నటి కాజల్ కూడా మరో సినిమా చేస్తున్నారని, దానిపేరు సత్యభామ అంటూ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











