Balakrishna: కూతపెట్టి తొడ గొట్టిన బాలయ్య.. ప్రత్యర్థులను కబడ్డి ఆడించిన నటసింహం!

నందమూరి నటసింహం బాలయ్య.. యుద్ధ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు.. అది కూడా ఇద్దరు హీరోలతో తలపడబోతున్నాడు. కోలీవుడ్ నుంచి కిచ్చ సుధీప్, బాలీవుడ్ నుంచి టైగర్ ష్రాఫ్... ఇలా వీరితో పోటీకి దిగాడు బాలయ్య. కండల బలంతో కొట్టేద్దాం అంటూ ముందుకు దూసుకుపోతున్నాడు... అదేంటి కొత్త మల్టీ స్టారర్ మూవీ ఏమైనా తీస్తున్నాడా.. అది పాన్ ఇండియా లెవెల్ లో అని అనుకుంటున్నారా.. కాదండి.. బాలయ్య ఇప్పుడు మరో కొత్త పనికి శ్రీకారం చుట్టారు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కరోనా కాలం తర్వాత బాలయ్యకు పట్టిందల్లా బంగరం అయిపోతుంది. కరోనాతో అందరూ భయపడుతుంటే.. అఖండ అనే సినిమాతో వచ్చి.. బాక్సులు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత అన్ స్టాపబుల్ షో అంటూ బుల్లితెరపై సందడి చేశాడు. సీజన్ వన్ సక్సెస్ కావడంతో.. సీజన్ 2 తీయగా.. అది సూపర్ సక్సెస్ అయింది. ఇక సంక్రాంతికి వీర సింహరెడ్డి సినిమాతో వచ్చి.. మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేశాడు.

Nandamuri Balakrishna Kichcha Sudeep Tiger Shroff Promoting Pro Kabaddi League Video Released Full Details Here

ఇక ఈ దసరా జోర్ దార్ ఉంటది అంటూ భగవంత్ కేసరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. వర్కింగ్ టైటిల్ ఎన్బీకే 109గా తెరకెక్కుతుంది. ఇక మొన్ననే షూటింగ్ ప్రారంభం అయింది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, త్రిష హీరోయిన్లుగా అనుకుంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ.

ఇంత బిజీలోనూ బుల్లితెరపై అన్ స్టాపబుల్ తో సందడి చేస్తూనే మరో శ్రీకారం చుట్టారు బాలయ్య. అదేంటో కాదు.. ప్రో కబడ్డి. మొన్నటి వరకు క్రికెట్ జోష్ ముగిసింది.. ఇప్పుడు ప్రో కబడ్డి సందడి మొదలు కానుంది. ఈ క్రమంలోనే బాలయ్య దానికి ప్రమోట్ చేస్తున్నాడు. సినిమా సెలబ్రిటీలు... స్పోర్ట్స్ వాటికి ప్రమోట్ చేయడం కొత్తేమి కాదు.. కొన్ని రోజుల క్రితం వాలీబాల్ కోసం విజయ్ దేవరకొండ కూడా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు కబడ్డీ లీగ్ కోసం మూడు సినీ పరిశ్రమల నుంచి ముగ్గురు హీరోలు కదిలి వచ్చారు. తాజాగా బాలకృష్ణ, కిచ్చ సుదీప్, టైగర్ ష్రాఫ్ లతో ప్రో కబడ్డీ లీగ్ కోసం ఒక యాడ్ డిజైన్ చేశారు నిర్వాకులు. తాజాగా ఈ యాడ్ కు సంబంధించిన వీడియో విడుదల అయింది. ఇందులో ముగ్గురు హీరోలు గుర్రాల మీద యోధుల్లాగా వచ్చి... కబడ్డి ఆడుతున్నారు. ఇక బాలయ్య అయితే.. కూత పెట్టి తొడకొట్టి కబడ్డి ఆటలోకి దిగుతారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోని షేర్ చేస్తూ.. కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట... మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట.... కండల బలమే ఆయుధంగా, మైదానమే రణస్థలంగా, పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్ కావద్దు అంటూ తెలిపారు నిర్వహాకులు. ఈ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 డిసెంబర్ 2 నుంచి మొదలు కానున్నట్లు ప్రకటించారు. 12 టీమ్స్ ఇందులో బరిలోకి దిగాగా... మూడు పరిశ్రమల నుంచి హీరోలతో యాడ్ చేసి ప్రమోట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X